Vastu Tips: వేణువును ఇంట్లో ఉంచుకోవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.. అదృష్టానికి తలుపు తెరచినట్లే..
వేణువు శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైనది. అందుకే వేణువు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నవారిపై శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. ఇంట్లో వేణువును ఉంచడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, కుటుంబ సభ్యుల మధ్య మంచి సమన్వయం ఉంటుందని నమ్ముతారు. వేణువును ఇంట్లో ఉంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రంలో వేణువు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాస్తు ప్రకారం, చెక్క వేణువును ఉంచడం వల్ల ఇంటికి సానుకూల శక్తి వస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంటికి ఆనందం, శాంతి, శ్రేయస్సు వస్తాయి. ఇంట్లో వేణువు ఉండటం వల్ల నెగటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుందని నమ్ముతారు. వేణువు శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైనది. అందుకే వేణువు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నవారిపై శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. వేణువును ఇంట్లో ఉంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
వేణువును ఇంట్లో ఉంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఇంట్లో వేణువును ఉంచడం వల్ల పేదరికం తొలగిపోయి ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయి. కుటుంబంలో గొడవలు జరుగుతున్నా.. భార్యాభర్తల వైవాహిక జీవితం ఒత్తిడితో సాగుతున్నా.. ఇంట్లో అశాంతి వాతావరణం నెలకొంటే ఆ ఇంట్లో వెదురుతో చేసిన వేణువును ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి.
ఇంట్లో వేణువును ఉంచడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, కుటుంబ సభ్యుల మధ్య మంచి సమన్వయం ఉంటుందని నమ్ముతారు. ఇంట్లో ఏదైనా జబ్బు మిమ్మల్ని చాలా కాలంగా బాధపెడుతుంటే లేదా ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పూర్తిగా కోలుకోలేకపోతే అటువంటి పరిస్థితిలో, ఖచ్చితంగా ఇంట్లో ఒక వేణువును ఉంచండి. ఇంట్లో వేణువును పెట్టుకోవడం వల్ల అనారోగ్యంతో ఉన్నవారు త్వరగా కోలుకుంటాడని నమ్మకం. ఇంట్లో వేణువును ఉంచడం వల్ల చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పని పూర్తి అవుతుందని విశ్వాసం.
వేణువు వలన ఉపయోగాలు..
వేణువు గానం కోసం చేతిని కదిలించినప్పుడు.. ప్రతికూల శక్తి అంతా ఆ ప్రదేశం నుండి వెళ్లిపోతుందని .. వేణువు వాయించినప్పుడు పవిత్రమైన అయస్కాంత ప్రవాహం ఇంట్లో ప్రవహిస్తుంది అని విశ్వాసం.
ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో వేణువును ఉంచడం వల్ల ఉద్యోగం ప్రయత్నాల్లో ఉన్నవారికి శుభం కలుగుతుందట.
వ్యాపారంలో సమస్యలను ఎదుర్కొంటున్నవారు వేణువుని పెట్టుకుంటే.. సమస్యలు పరిష్కారం అయ్యేలా చేస్తుందట.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు