AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: 1992లో సముద్రంలో విరిసిన సీసా 32 ఏళ్ల తర్వాత తీరానికి.. లోపల లెటర్ లో ఏముందంటే..

ఆడమ్ ట్రావిస్ అనే వ్యక్తి షిన్నెకాక్ బేలో ఈ బాటిల్ ను అందులో ఉన్న లేఖను చూశాడు. అనంతరం మట్టిటక్ హై స్కూల్ అలుమ్ని అనే ఫేస్‌బుక్ పేజీలో బాటిల్ తో పాటు ఉత్తరం ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. ఆ లెటర్ రాసిన విద్యార్థుల్లో ఒకరైన బెన్నీ డోరోస్కీ ఈ పోస్ట్‌ను చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. ఎర్త్ సైన్స్ ఉపాధ్యాయుడు రిచర్డ్ ఇ. బ్రూక్స్ ని గుర్తు చేసుకుంటూ ఈ లెటర్ రాసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నారు.

Viral News: 1992లో సముద్రంలో విరిసిన సీసా 32 ఏళ్ల తర్వాత తీరానికి.. లోపల లెటర్ లో ఏముందంటే..
Letter In The BottleImage Credit source: Facebook/@AdamTravis
Surya Kala
|

Updated on: Feb 05, 2024 | 7:17 PM

Share

సముద్రం తన గర్భంలో ఏ వస్తువుని దాచుకోదు.. ఏదొక సమయంలో తీరానికి విసిరేస్తుంది అని పెద్దలు చెబుతారు. అందుకు సాక్ష్యంగా  చాలా సార్లు సముద్ర తీరంలో దశాబ్దాల నాటి ఏదో వస్తువులు కనిపిస్తూ  ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవల న్యూయార్క్‌లోని షిన్నెకాక్ బేలో ఇలాంటిదే ఒకటి కనిపించింది. ఇది ఒక గాజు సీసా. అయితే గాజు సీసా కనిపించడం కూడా ఒక విశేషమేనా అని అనుకుంటుంటే.. అది నార్మల్ బాటిల్ కాదు మరి. గత 32 ఏళ్లుగా సముద్రంలో తేలియాడుతున్నది. అందులో ఓ లేఖ కూడా ఉంది.  ఎవరో  ఉత్తరం రాసిన తర్వాత  ఆ సీసాలో ఈ ఉత్తరాన్ని సీల్ చేసి అట్లాంటిక్ మహాసముద్రంలోకి విసిరారు.

న్యూయార్క్‌లోని మాటిటక్ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న షాన్ , బెన్నీ అనే విద్యార్థులు 1992లో ఈ లేఖ రాశారు. విద్యార్థులు ఈ బాటిల్‌ను ఎర్త్ సైన్స్ ప్రాజెక్ట్‌గా లాంగ్ ఐలాండ్ సమీపంలోని అట్లాంటిక్ మహాసముద్రంలోకి విసిరారు. లేఖలో విద్యార్థులు ఇచ్చిన సమాచారాన్ని పూరించండి .. ఇచ్చిన చిరునామాకు బాటిల్‌ను తిరిగి ఇవ్వండి. అంటూ స్కూల్ అడ్రస్ రాశారు కూడా.

nypost ప్రకారం.. ఆడమ్ ట్రావిస్ అనే వ్యక్తి షిన్నెకాక్ బేలో ఈ బాటిల్ ను అందులో ఉన్న లేఖను చూశాడు. అనంతరం మట్టిటక్ హై స్కూల్ అలుమ్ని అనే ఫేస్‌బుక్ పేజీలో బాటిల్ తో పాటు ఉత్తరం ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. ఆ లెటర్ రాసిన విద్యార్థుల్లో ఒకరైన బెన్నీ డోరోస్కీ ఈ పోస్ట్‌ను చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. ఎర్త్ సైన్స్ ఉపాధ్యాయుడు రిచర్డ్ ఇ. బ్రూక్స్ ని గుర్తు చేసుకుంటూ ఈ లెటర్ రాసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

బెన్నీ ఇలా వ్రాశాడు.. మిస్టర్ బ్రూక్స్ అద్భుతమైన ఉపాధ్యాయుడు. ఈ ఉత్తరం వయసు 32 సంవత్సరాలు  అని నమ్మలేకపోతున్నాను. బాటిల్ దొరికిన వ్యక్తిని కలవాలనుకుంటున్నాను. బెన్ని చేసిన వ్యాఖ్యకు ఆడమ్ స్పందించాడు..  సమాధానం ఇవ్వడంతో బెన్ని కోరిక కూడా నెరవేరింది. ఆడమ్ బాతులను వేటాడే పరికరాలను శుభ్రం చేస్తున్నప్పుడు.. శిధిలాల కుప్ప పైన ఒక బాటిల్ ను అందులో ఉన్న ఉత్తరాన్ని చూసినట్లు ఆడమ్ చెప్పాడు.

Adam Travis

Adam Travis

అదే సమయంలో టీచర్ బ్రూక్స్ కొడుకు జాన్ ఈ పోస్ట్ చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. విద్యార్థులతో కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం నచ్చింది. ఇది మాకు మొమెంటో కంటే తక్కువ కాదని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ ఉత్తరం గురించి ప్రపంచానికి తెలియజేసిన జాన్ ఆడమ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే తన తండ్రి ఈ ప్రపంచంలో ఇప్పుడు లేరని.. గత సంవత్సరం అల్జీమర్స్‌తో మరణించారని చెప్పారు ఉపాధ్యాయుడి కొడుకు జాన్.

మీడియా కథనాల ప్రకారం ఇలా సముద్రంలో బాటిల్ లెటర్ తేలుతూ ఒడ్డుకు చేరుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో వెలుగులోకి వచ్చాయి. 1997లో కూడా ఇలాంటి వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఫ్రాన్స్‌లోని వెండీలో మసాచుసెట్స్‌కు చెందిన ఐదవ తరగతి విద్యార్థి రాసిన బాటిల్ సందేశం కనిపించింది. అంతేకాదు 1972లో రాసిన లేఖ 2019లో దొరికింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..