Ram Mandir: అయోధ్యలో బాల రామయ్య కొలువు దీరిన వేళ.. వానరాలు చేసిన పనికి భక్తుల తన్మయత్వం.. వీడియోలు వైరల్

అయోధ్యలో రామయ్య కొలువుదీరే వేళ కోట్లాది మంది హిందువులకు మాత్రమే కాదు.. మాకు కూడా ఆనందమే అంటున్నాయి వానరాలు. రామయ్య ప్రాణ ప్రతిష్టకు ముందు.. తర్వాత అనేక పూజ స్థలాల్లో.. యజ్ఞ యాగాదుల్లో మేము సైతం అంటూ భక్తితో రామయ్యను పూజించాయి. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Ram Mandir: అయోధ్యలో బాల రామయ్య కొలువు దీరిన వేళ.. వానరాలు చేసిన పనికి భక్తుల తన్మయత్వం.. వీడియోలు వైరల్
Ayodhya Ram Mandir
Follow us
Surya Kala

|

Updated on: Feb 05, 2024 | 7:54 PM

అయోధ్యలోని రామ మందిరంలో ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమం జరుగుతున్న సమయంలో రాముడికి నమస్కరిస్తున్న వానరాల ఆశ్చర్యకరమైన దృశ్యాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు. అందులో పలు వీడియోలు వైరల్‌గా మారాయి. అయోధ్యలోని రామమందిరాన్ని భక్తుల దర్శనం కోసం తెరిచిన రోజున గర్భ గుడిలో ప్రవేశించిన వానరం గురించి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాట్లాడుతూ.. “హనుమంతుడు స్వయంగా బాల రామయ్య దర్శనం కోసం వచ్చినట్లుగా” చెప్పారు. అయోధ్యలోని రామమందిరంలో బాల రామ విగ్రహం యొక్క ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుకకు ముందు రోజుల్లో .. ఆ తర్వాత కొన్ని రోజులలో రాముడికి నమస్కరించిన వానరాలు అసాధారణ సంఘటనలను ప్రజలు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.

 Shri Ram Janmbhoomi Teerth Kshetra Trust on X

ఇవి కూడా చదవండి

కాషాయపు జెండాపై “రాముడి పాదాలను తాకడానికి” కోతి వెదురు స్తంభం ఎక్కుతున్న వీడియో క్లిప్‌ను ఒకరు  పోస్ట్ చేస్తే, మరొక వ్యక్తి పూజా స్థలాన్ని సందర్శించి, ‘యఙ్గ గుండానికి నమస్కరిస్తున్న వీడియోను షేర్ చేశారు. ఇటీవల భక్తులతో నిండిన ఆలయంలో వానరం వెళ్లి దణ్ణం పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

“ఆలయానికి వచ్చిన కోతి అరటిపండ్లు, తినడానికి ఇచ్చిన ఏమీ ముట్టుకోలేదు. శ్రీరాముడి దగ్గర కూర్చుని, శ్రీరాముడి పాదాలను తాకి వెళ్ళిపోయింది” అని ఎక్స్‌పై పోస్ట్ క్యాప్షన్‌లో పేర్కొన్నారు.

రాముడు, సీత , లక్ష్మణుడి విగ్రహాలను చేరుకోవడానికి వానరం పూజ పీఠం ఎక్కినప్పుడు  భక్తులు చేతులు జోడించి “జై శ్రీ రామ్” , “జై శ్రీ హనుమాన్” అని నినాదాలు చేస్తూ ముకుళిత హస్తాలతో ప్రార్థించడం కనిపించింది.

“22 జనవరి 2024న అయోధ్యలో రామ్ లల్లా పవిత్రోత్సవం జరిగిన రోజున  ఒక వానరం మహారాష్ట్రలోని లోనావాలాలోని శ్రీరామ ఆలయాన్ని సందర్శించింది” అని SK చక్రవర్తి అనే వినియోగదారు పోస్ట్‌లో సంఘటన స్థలం, సమయాన్ని కూడా చెప్పారు.

ఈ వీడియోకు ప్రతిస్పందించిన వినియోగదారులు దీనిని “కొంత దైవిక శక్తి” అని పిలిచారు. అంతేకాదు ఈ వానరానికి తమ మూలాలు తెలుసు (అతను హనుమంతుడు రాముడికి చెందినవాడు)” అని అన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..