Mahabharat: ఆడవారి మనసులో ఏ విషయం దాగదు.. దీనికి కారణం ధర్మరాజు తన తల్లి కుంతికి ఇచ్చిన శాపమేనా..
మహాభారత యుద్ధంలో అనేక సంఘటనలు జరిగాయి. అవి నేటికీ ప్రజల జీవన విధానానికి విద్య వనరుగా మారింది. ఈ యుద్ధం ముగిసిన తర్వాత యుధిష్ఠిరుడు తన తల్లి కుంతికి శాపం ఇచ్చాడు. అయితే.. పాండవులు తమ తల్లి కుంతిని ఎంతగానో ప్రేమిస్తే.. యుధిష్టరుడు ఎందుకు శాపం ఇవ్వాల్సి వచ్చింది ఈ రోజు తెలుసుకుందాం..

పంచమ వేదంగా కీర్తింపబడుతున్న మహాభారత కథను తప్పనిసరిగా ఎప్పుడొకప్పుడు ఉంటారు. మన పెద్దలు తింటే గారెలే తినాలి.. వింటే భారతం వినాలి అంటూ జీవితంలో ప్రధమ స్థానాన్ని ఇచ్చారు. మహాభారత యుద్ధంలోని ప్రతి అంశానికి సంబంధించిన కథలు ఉన్నాయి. మహాభారత యుద్ధంలో అనేక సంఘటనలు జరిగాయి. అవి నేటికీ ప్రజల జీవన విధానానికి విద్య వనరుగా మారింది. ఈ యుద్ధం ముగిసిన తర్వాత యుధిష్ఠిరుడు తన తల్లి కుంతికి శాపం ఇచ్చాడు. అయితే.. పాండవులు తమ తల్లి కుంతిని ఎంతగానో ప్రేమిస్తే.. యుధిష్టరుడు ఎందుకు శాపం ఇవ్వాల్సి వచ్చింది ఈ రోజు తెలుసుకుందాం..
యుధిష్ఠిరుడు దుఃఖం
మహాభారత యుద్ధంలో గెలిచిన తరువాత యుధిష్ఠిరుడు యుద్ధంలో మరణించిన తన కుటుంబ సభ్యులకు, బంధువుల ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేస్తున్నాడు. అందుకోసం దాదాపు నెల రోజులు గంగా తీరంలో ఉన్నాడు. ఈ సమయంలో యుధిష్ఠిరుని ఓదార్చడానికి చాలా మంది ఋషులు వచ్చారు. అందులో దేవఋషి నారదుడు వచ్చి యుధిష్ఠిరుని అడిగాడు… దుర్యోధనుడిని ఓడించి రాజ్యాన్ని సాధించుకున్న తరువాత కూడా నువ్వు సంతోషముగా లేవా అని అడిగాడు.
నా ప్రియమైన వారి మరణంతో నేను బాధపడ్డాను.
యుధిష్ఠిరుడు నారదుని ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ యుద్ధంలో నేను విజయం సాధించాను. అదే సమయంలో మన దురాశ కారణంగా, మన సొంత బంధుగణాన్ని చంపినందుకు నేను చాలా బాధపడ్డాను. అభిమన్యుడి మరణం వల్ల ద్రౌపది పడిన బాధ చూసిన తర్వాత అనేక మంది యోధులను చంపి దక్కించుకున్న ఈ విజయం నాది అని నేను భావించను. కర్ణుడు మా అన్న విషయం మా ఐదుగురు అన్నదమ్ములకు తెలియదు. అయితే కర్ణుడు మా అన్నయ్య అని తెలియకుండా సొంత అన్నయ్యనే చంపేశశామని పేర్కొన్నాడు.
కుంతీకి శాపం ఇచ్చిన ధర్మరాజు
యుధిష్ఠిరుడు నారదుడి ముందు దుఃఖిస్తూండగా అతని తల్లి కుంతి అక్కడికి వచ్చి ఓదార్చడం ప్రారంభించింది. తల్లి కుంతి మాటలు విన్న యుధిష్ఠిరుడు ఆగ్రహించి తన తల్లితో ఇంత పెద్ద విషయాన్ని దాచి మనల్ని కాపాడావు. అన్నయ్య చంపించి మమ్మల్ని హంతకుడిని చేశావు.. అంటూనే యుధిష్ఠిరుడు కోపోద్రిక్తుడై తన తల్లి కుంతితో సహా మొత్తం స్త్రీ జాతిని శపించాడు. ఈ రోజు నుంచి స్త్రీ జాతి కోరుకున్నప్పటికీ వారు తమ హృదయంలో ఏ విషయాన్నీ దాచుకోలేరు అని శపిస్తున్నానని అన్నాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు








