White Strawberry: మనదేశంలో అడుగు పెట్టిన టేస్టీ టేస్టీ వైట్ స్ట్రాబెర్రీస్.. పండించాలంటే ఈ రైతు అనుమతి తప్పనిసరి

ఇప్పటి వరకూ మన దేశంలో ఎర్రటి స్టాబెర్రీలను చూసినా విదేశాల్లో మాత్రం ఎప్పటి నుంచో తెల్ల స్ట్రాబెర్రీలు మార్కెట్లో సందడి చేయడం మొదలు పెట్టాయి. 2010ల ప్రారంభంలో ప్రజాదరణ వైట్ స్ట్రాబెర్రీలు కొన్ని తెల్లగా మరికొన్ని లేత గులాబీ రంగులో ఉంటాయి. వీటి టేస్ట్ కూడా చాలా తియ్యగా ఉంది.. జ్యుసిగా ఉంటాయి. అయితే ఈ వైట్ స్టాబెర్రీలు మన దేశంలో అడుగు పెట్టాయి. అది కూడా మన రైతే పండించడం విశేషం. 

White Strawberry: మనదేశంలో అడుగు పెట్టిన టేస్టీ టేస్టీ వైట్ స్ట్రాబెర్రీస్.. పండించాలంటే ఈ రైతు అనుమతి తప్పనిసరి
White Strawberries Farming
Follow us
Surya Kala

|

Updated on: Feb 07, 2024 | 3:42 PM

స్ట్రాబెరీస్ విదేశాల నుంచి మన దేశంలోకి అడుగు పెట్టి ఇక్కడ కూడా ఆదరణ సొంతం చేసుకున్నాయి.  తియ్యగా పుల్లగా ఎరుపు రంగులో ఆకర్షణీయంగా ఉండే స్ట్రాబెర్రీలు పిందెలుగా ఉన్న సమయంలో తెల్లగా ఉంటాయి. అవి పక్వానికి వచ్చే కొద్దీ ఎరుపురంగులోకి మారతాయి. అయితే ఇప్పటి వరకూ మన దేశంలో ఎర్రటి స్ట్రాబెరీస్లను చూసినా విదేశాల్లో మాత్రం ఎప్పటి నుంచో తెల్ల స్ట్రాబెర్రీలు మార్కెట్లో సందడి చేయడం మొదలు పెట్టాయి. 2010ల ప్రారంభంలో ప్రజాదరణ వైట్ స్ట్రాబెర్రీలు కొన్ని తెల్లగా మరికొన్ని లేత గులాబీ రంగులో ఉంటాయి. వీటి టేస్ట్ కూడా చాలా తియ్యగా ఉంది.. జ్యుసిగా ఉంటాయి. అయితే ఈ వైట్ స్టాబెర్రీలు మన దేశంలో అడుగు పెట్టాయి. అది కూడా మన రైతులే పండించడం విశేషం.

మహారాష్ట్రలోని ఓ రైతు ప్రత్యేకమైన తెల్లని స్ట్రాబెర్రీని పండిస్తున్నారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మహాబలేశ్వర్, భిలార్, వై ప్రాంతాల్లో స్ట్రాబెర్రీలను పండిస్తారు. ఇప్పుడు సతారాలోని వాయిలోని ఫూలే నగర్‌లో నివసిస్తున్న ఒక రైతు తెల్ల స్ట్రాబెర్రీలను పండించాడు.

సతారాలోని ఫూలేనగర్‌కు చెందిన ఉమేష్ ఖమ్కర్ అనే రైతు అర ఎకరంలో తెల్లటి స్ట్రాబెర్రీతో ప్రయోగాలు చేశాడు. మార్కెట్‌లో ఈ స్ట్రాబెర్రీలను విక్రయించడం కూడా ప్రారంభించాడు. త్వరలో ఈ ప్రత్యేకమైన వైట్ స్ట్రాబెర్రీ ఆన్‌లైన్‌లో కూడా విక్రయించడానికి రెడీ అవుతున్నాడు.

ఇవి కూడా చదవండి

వైట్ స్ట్రాబెర్రీ ప్రత్యేకత

ఈ స్ట్రాబెర్రీ ప్రత్యేకత ఏమిటంటే దీని ధర కిలో 1000 నుండి 1500 రూపాయల వరకు ఉంటుంది. ఈ స్ట్రాబెర్రీ దిగుబడి ఆరు రెట్లు ఎక్కువ కావడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. వీటి టేస్ట్ కూడా చాలా తియ్యగా ఉంది.. జ్యుసిగా ఉంటాయి. కొన్ని అనాస పండు ఫ్లేవర్ ని కూడా కలిగి ఉంటాయి.

US , UK ల్లో ఈ వైట్ స్ట్రాబెర్రీస్ పై ప్రయోగం

ఈ తెల్లని స్ట్రాబెర్రీని మొదట అమెరికా, ఇంగ్లండ్‌లో ప్రయోగించారు. ఈ స్ట్రాబెర్రీ పేరు ఫ్లోరిడా పెర్ల్. ఈ రకమైన స్ట్రాబెర్రీ భారతదేశంలో మొదటిసారిగా సాగు చేస్తున్నాయి. ఈ తెల్లటి స్ట్రాబెర్రీ మహారాష్ట్రలో  మొదటిసారిగా సాగు చేస్తున్నారు. త్వరలో ఈ  వైట్ స్ట్రాబెర్రీ సాగును ఇతర ప్రాంతాల్లో కూడా మొదలు పెట్టనున్నారు. భారతదేశంలో తెల్లటి స్ట్రాబెర్రీలను సాగు చేసిన రైతుగా సతారా వాయికి చెందిన రైతు ఉమేష్ ఖమ్కర్‌ ఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. ఇందుకోసం యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా నుంచి రాయల్టీ హక్కులను కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఎవరైనా భారతదేశంలో సాగు చేయాలనుకుంటే.. ఆ రైతులు తప్పని సరిగా  ఉమేష్ ఖమ్కర్ నుండి వైట్ స్టాబ్రేర్రీ సాగు చేసేందుకు హక్కులను కొనుగోలు చేయాల్సి ఉంది.

వైట్ స్ట్రాబెర్రీస్ లక్షణాలు ఏమిటి?

వైట్ స్ట్రాబెర్రీలు ఎరుపు స్ట్రాబెర్రీల కంటే కొంచెం తియ్యగా ఉంటాయి.

స్ట్రాబెర్రీలలో ఉండే పోషకాల వల్ల శరీరానికి మేలు చేస్తుంది.

స్ట్రాబెర్రీలు తక్కువ సహజ ఆమ్లత్వం కారణంగా ప్రసిద్ధి చెందాయి. వి

దేశాల్లో కూడా వైట్స్ స్ట్రాబెర్రీలు బాగా ప్రాచుర్యం పొందాయి.

ఈ స్ట్రాబెర్రీలకు భారతదేశంలో కూడా మంచి మార్కెట్ ఉంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!