AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkey Fever: వణికిస్తున్న భయంకరమైన ‘మంకీ ఫీవర్’.. జాగ్రత్తలు ఇవే!

కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా బయట పడకుండానే.. కొత్త కొత్త వైరస్‌లు రోగాలు జనాల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మరో కొత్త వ్యాధి జనాల్ని భయ పెడుతుంది. అదే 'మంకీ ఫీవర్'. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా కూడా ఈ మంకీ ఫీవర్ హడలెత్తిస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కోతుల బెడద ఎక్కువగా ఉంటోంది. మంకీ ఫీవర్‌ను క్యాసనూర్ ఫారెస్ట్ డీజీజ్ అని కూడా అంటారు. ఈ వైరస్ మొదట కర్నాటకలో బయట పడింది. ఈ ఫీవర్‌తో ఇప్పటికే ఇద్దరు..

Monkey Fever: వణికిస్తున్న భయంకరమైన 'మంకీ ఫీవర్'.. జాగ్రత్తలు ఇవే!
Monkey Fever
Chinni Enni
|

Updated on: Feb 07, 2024 | 5:19 PM

Share

కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా బయట పడకుండానే.. కొత్త కొత్త వైరస్‌లు రోగాలు జనాల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మరో కొత్త వ్యాధి జనాల్ని భయ పెడుతుంది. అదే ‘మంకీ ఫీవర్’. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా కూడా ఈ మంకీ ఫీవర్ హడలెత్తిస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కోతుల బెడద ఎక్కువగా ఉంటోంది. మంకీ ఫీవర్‌ను క్యాసనూర్ ఫారెస్ట్ డీజీజ్ అని కూడా అంటారు. ఈ వైరస్ మొదట కర్నాటకలో బయట పడింది. ఈ ఫీవర్‌తో ఇప్పటికే ఇద్దరు మరణించారు. కర్నాటకలో దాదాపు 49 మందికి ఈ వైరస్ సోకినట్లు ఆ రాష్ట్రం తెలిపింది. అసలు ఈ మంకీ ఫీవర్ ఎలా వస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి. ఎలాంటి చికిత్సలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మంకీ ఫీవర్ ఎలా వస్తుంది?

ఏవైనా కీటకాలు కోతులను కుట్టి.. అవి వచ్చి మళ్లీ మనుషుల్ని కుట్టినప్పుడు ఈ మంకీ ఫీవర్ అనేది వస్తుంది. ఈగల ద్వారా ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. ఈ మంకీ ఫీవర్.. మనిషికి వచ్చిందంటే బాగా నీరసించిపోతాడు.

మంకీ ఫీవర్ లక్షణాలు:

ఈ ఫీవర్ వచ్చినప్పుడు బాగా నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. మొదట జ్వరం వస్తుంది. ఆ తర్వాత దగ్గు, జలుబు, తల నొప్పి, వాంతులు, విరేచనాలు కూడా అవుతాయి. తీవ్రమైన వణుకు, దృష్టి లోపం, చికాకు కూడా కొందరిలో కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ముక్కు రంద్రాల పైభాగం నుంచి రక్త స్రావం, గొంతు, చిగుళ్ల నుంచి రక్త స్రావం, పేగు కదలికల సమయంలో రక్త స్రావం వంటివి కూడా కనిపిస్తాయి. వణుకు, గందరగోళం, మానసిక ఆందోళన కూడా ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలన్నీ కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మేలు. వెంటనే ఆస్పత్రికి వెళ్లి టీకాలు వేయించుకోవాలి. ఈ ఫీవర్ వచ్చిన వాళ్లు ఇతర ప్రదేశాలు వెళ్లకూడదు.

ఇవి కూడా చదవండి

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఈ ఫీవర్ వచ్చినప్పుడు వీలైనంత వరకూ బయటకు వెళ్లకుండా ఉండటం మంచింది. ఎందుకంటే ఈ ఫీవర్ ఇతరులకు కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. చేతులకు గ్లౌజులు ధరించడం మేలు. వ్యక్తి గత శుభ్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ ఫీవర్ సాధారణంగా ఉంటుంది. అయితే లక్షణాలు మరింత తీవ్రమైతే మాత్రం జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.