Gut Health: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. మీ గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా!
ప్రస్తుతం మెల్ల మెల్లగా వాతావరణం మారుతుంది. చలి వదిలి నెమ్మదిగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజల నుంచి ఉష్ణోగ్రతలు అనేవి బాగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రకృతితో పాటు శరీరంలో కూడా అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు బాహ్య శరీరంపైనే కాకుండా.. అంతర్గతంగా జీర్ణ వ్యవస్థపై కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇలా వాతావరణం మారుతున్న క్రమంలోనే సరైన ఆహారాలు తీసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు..

ప్రస్తుతం మెల్ల మెల్లగా వాతావరణం మారుతుంది. చలి వదిలి నెమ్మదిగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజల నుంచి ఉష్ణోగ్రతలు అనేవి బాగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రకృతితో పాటు శరీరంలో కూడా అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు బాహ్య శరీరంపైనే కాకుండా.. అంతర్గతంగా జీర్ణ వ్యవస్థపై కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇలా వాతావరణం మారుతున్న క్రమంలోనే సరైన ఆహారాలు తీసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవు. అయితే మీ దిన చర్యలో కొన్ని రకాల మార్పులు, చేర్పులు చేసుకుంటే సరిపోతుంది. దీంతో గట్ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. మరి గట్ ఆరోగ్యం మెరుగు పడాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోండి:
ఉష్ణోగ్రతలు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో హైడ్రేషన్ అనేది చాలా ముఖ్యం. కాబ్టటి నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అంతే కాకుండా ఇది జీర్ణ క్రియకు కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. పోషకాల శోషణకు పేగుల్లోని శ్లేష్మ పొర బాధ్యత వహిస్తుంది. కేవలం నీటిని మాత్రమే కాకుండా.. నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా తీసుకుంటూ ఉండాలి. దోసకాయలు, పుచ్చకాయలు, సిట్రస్ ఫ్రూట్స్ వంటి వాటిని అధికంగా తీసుకోవాలి.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు:
ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఫైబర్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. వాతావరణ పరిస్థితులు మారుతున్న క్రమంలో మీరు ఫైబర్ అంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. మీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోండి. ఫైబర్ సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహించడమే కాకుండా ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియాకు ఇంధనంగా కూడా పనిచేస్తుంది.
ఆనందంగా తినండి:
మీరు ఆహారం తీసుకునేటప్పుడు రిలాక్స్‌గా తీసుకోండి. తినే ఆహారాన్ని పూర్తిగా నమిలి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం మైండ్ ఫుల్ ఫుడ్ డిజెస్టివ్ ఎంజైమ్‌లు రిలీజ్ అవుతాయి. ఇది జీవక్రియను కూడా మెరుగు పరుస్తుంది. ఆహారం విచ్ఛిన్నం చేయడంలో కూడా సహాయ పడుతుంది.
ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి:
ప్రోబయోటిక్స్ అనేవి మీ గట్ ఆరోగ్యాన్ని పెంచుతుంది. కాబట్టి ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచింది. పెరుగు, గ్రీన్ పీస్, బ్రౌన్ బ్రెడ్, డార్క్ చాక్లెట్, చీజ్, ఇతర ప్రోబయోటిక్స్ ఆహారం తీసుకోవడం చాలా మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.








