AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stability in Child: పిల్లల్లో ఏకాగ్రతను పెంచాలి అనుకుంటున్నారా.. వీటిని మస్ట్ ట్రై చేయండి!

యోగా ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం అందరికీ తెలుసు. యోగాతో ఒక్కటేంటి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చెప్పడం కష్టమే. అలాగే యోగాతో చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. యోగా చేయడం వల్ల శారీరకంగా.. మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. చిన్నప్పటినుంచే పిల్లలకు యోగా ఆసనాలు చేయడం నేర్పించే వాళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా పిల్లల్లో ఏకాగ్రత పెంచాలి అనుకుంటే.. యోగాసనాలు చాలా బెస్ట్. ఏకాగ్రత అనేది పిల్లల..

Stability in Child: పిల్లల్లో ఏకాగ్రతను పెంచాలి అనుకుంటున్నారా.. వీటిని మస్ట్ ట్రై చేయండి!
Stability In Child
Chinni Enni
|

Updated on: Feb 07, 2024 | 6:04 PM

Share

యోగా ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం అందరికీ తెలుసు. యోగాతో ఒక్కటేంటి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చెప్పడం కష్టమే. అలాగే యోగాతో చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. యోగా చేయడం వల్ల శారీరకంగా.. మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. చిన్నప్పటినుంచే పిల్లలకు యోగా ఆసనాలు చేయడం నేర్పించే వాళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా పిల్లల్లో ఏకాగ్రత పెంచాలి అనుకుంటే.. యోగాసనాలు చాలా బెస్ట్. ఏకాగ్రత అనేది పిల్లల చదువుల్లో ఇతర వాటిల్లో బాగా సహయ పడుతుంది. పిల్లల్లో ఏకాగ్రత పెంచే యోగాసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పద్మాసన ఆసనం:

ఈ యోగాసనాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఈ ఆసనం వేయడం చాలా సింపుల్. రెండు కాళ్లు క్రాస్ చేసి వేస్తారు. ఈ సింపుల్ ఆసనం పిల్లలతో వేయించడం వల్ల వారిలో ఏకాగ్రత అనేది మెరుగు పడుతుంది. బ్రేయిన్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. వెన్నుముక బలంగా ఉండటానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఫోకస్ పెరిగేలా చేస్తుంది.

తడాసనం:

ఇది యోగా ఆసనం వేయడం కూడా చాలా సింపుల్. తడాసనం పిల్లల్లో ఏకాగ్రత పెంచుకోవడానికి ఉపయోగ పడుతుంది. అలాగే పిల్లలు హైట్ పెరిగేందుకు కూడా ఈ ఆసనం బాగా హెల్ప్ చేస్తుంది. ఈ ఈజీ ఆసనం వేయడం వల్ల పిల్లల్లో బ్యాలెన్స్ పెరగడానికి, మజిల్స్ బలపడటానికి, ఫోకస్ పెరగడానికి సహాయ పడుతుంది.

ఇవి కూడా చదవండి

భరమూరి ప్రాణాయామం:

ఈ భరమూరి ప్రాణాయామం చేయడం కూడా ఈజీ. ఈ ఆసనం చేయాలంటే ముందు ప్రశాంతంగా కూర్చోవాలి. రెండు బొటన వేళ్లతో చెవులను మూసేయాలి. ఇప్పుడు గాలి పీల్చుకోవడానికి.. గొంతుతో హమ్మింగ్ చేస్తూ గాలి వదలాలి. ఇలా చేస్తే పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది.

వృక్షాసనం:

ఈ ఆసనం కూడా పిల్లల్లో ఒత్తిడిని తగ్గించి.. ఏకాగ్రత పెరిగేలా చేస్తుంది. అంతే కాకుండా బ్యాలెన్స్, స్టెబిలిటిటి, ఫోకస్ పెరుగుతుంది. మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. కాబట్టి ఈ వృక్షాసనం కూడా పిల్లలతో వేయించండి.

సూర్య నమస్కారాలు:

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సూర్య నమస్కారాలు అనేవి చాలా అవసరం. ప్రతి రోజూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల.. అందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు. అంతేకాకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలనికి కూడా బాగా హెల్ప్ చేస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.