Telangana: టికెట్లపై ఆ సామాజిక వర్గం ఆందోళన.. పార్టీలు సీరియస్‌గా తీసుకుంటున్నాయా ?

కమ్మ సామాజిక వర్గం ఆందోళన ఏదో రాజకీయంగా తాత్కాలికంగా రేగిన చిచ్చు కాదు. దశాబ్దాల పాటు తమకేంటి..అన్న ప్రశ్న నుంచి ఉదయించిన ఉద్యమం. అక్కడ రేణుక చౌదరి కాంగ్రెస్ నేతగా కనిపిస్తున్నా...కాంగ్రెస్సే కావాలని కమ్మవర్గాల్లో చిచ్చుపెట్టిందన్న ఆరోపణలు వినిపిస్తున్నా.. బీఆర్ఎస్‌ను రాజకీయంగా దెబ్బకొట్టాలన్న లక్ష్యంతోనే కమ్మ సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారన్న వెర్షన్ గట్టిగా ప్రచారంలోకివచ్చినా...ఇది కచ్చితంగా తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే సీరియస్ అంశంగానే చూడాలన్నది విశ్లేషకుల నుంచి వస్తున్నమాట.

Telangana: టికెట్లపై ఆ సామాజిక వర్గం ఆందోళన.. పార్టీలు సీరియస్‌గా తీసుకుంటున్నాయా ?
Brs, Bjp, Congress Party
Follow us
Aravind B

|

Updated on: Oct 07, 2023 | 10:00 PM

కమ్మ సామాజిక వర్గం ఆందోళన ఏదో రాజకీయంగా తాత్కాలికంగా రేగిన చిచ్చు కాదు. దశాబ్దాల పాటు తమకేంటి..అన్న ప్రశ్న నుంచి ఉదయించిన ఉద్యమం. అక్కడ రేణుక చౌదరి కాంగ్రెస్ నేతగా కనిపిస్తున్నా…కాంగ్రెస్సే కావాలని కమ్మవర్గాల్లో చిచ్చుపెట్టిందన్న ఆరోపణలు వినిపిస్తున్నా.. బీఆర్ఎస్‌ను రాజకీయంగా దెబ్బకొట్టాలన్న లక్ష్యంతోనే కమ్మ సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారన్న వెర్షన్ గట్టిగా ప్రచారంలోకివచ్చినా…ఇది కచ్చితంగా తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే సీరియస్ అంశంగానే చూడాలన్నది విశ్లేషకుల నుంచి వస్తున్నమాట. 20 లక్షల ఓట్లంటే సామాన్యమైన విషయం కాదు. కమ్మ సామాజిక వర్గం అంటే అంగ. అర్ధబలం బలంగా ఉన్న సామాజిక వర్గం. అలాంటి వర్గాన్ని నెగ్లెట్ చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ప్రతి పార్టీకి, నేతకూ తెలుసు. అందుకే కమ్మ సామాజిక వర్గం డిమాండ్లను విని ఊరుకోవడంలేదు ప్రధాన పార్టీలు. వారి డిమాండ్‌కు తగ్గ సీట్ల కేటాయింపు ఎంతవరకు సాధ్యం అన్నదానిపైనా సీరియస్‌గా ఆయా పార్టీలు ఆలోచిస్తున్నాయన్న చర్చా జరుగుతోంది.

ఇదేమీ ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన అసహనం కాదు. రాజకీయంగా తమను ఎదగనీయడంలేదన్న భావన కమ్మ వర్గాల్లో రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు రాజకీయాల్లో తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే తమ ఉనికి నామామాత్రంగా మారుతుందన్న భయం కమ్మనేతల్లో కనిపిస్తోంది. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత కమ్మలకు రాజకీయంగా మాంచి పట్టుదొరికింది. అప్పట్నుంచి మన తెలుగు రాష్ట్రంలో రాజకీయంగా కమ్మ వర్గానికి బలం బలగం పెరుగుతూ వచ్చింది. అయితే విభజన తర్వాత ఏపీలో రెడ్ల ఆధిపత్యం క్రమంగా పెరగడం.. ఇటు తెలంగాణలో వెలమ సామాజిక వర్గానికి అధికారం చేజిక్కడంతో…కమ్మ కాస్త వెనకబడింది. ఇదే కొనసాగితే తాము మరింత వెనకబడిపోతామన్న ఆందోళన కమ్మనేతల్లో కనిపిస్తోంది. వారి మాటల్లో వినిపిస్తోంది. బీఆర్ఎస్ వెలమ చేతుల్లోకి వెళ్లినా…రెడ్లకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం కమ్మ వర్గాల్లో అసంతృప్తిని పెంచిందన్నది విశ్లేషకుల మాట. ప్రధాన పార్టీలన్నీ రెడ్లకే ప్రాధాన్యత ఇస్తున్నాయన్న అసహనం వారిలో రోజరోజుకూ పెరగసాగింది. ఈనేపథ్యంలో తెలంగాణలో కమ్మ సామాజికవర్గం ఓటు బ్యాంకు ఈసారి ఏ పార్టీకి వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ అంశం కూడా ఇక్కడ కీలకంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని అధికారపార్టీలు రెండూ చంద్రబాబును కుట్రతోనే అరెస్ట్ చేయించారన్న భావన ఆ వర్గాల్లో వ్యక్తమవుతోంది. చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శనలు చేసిన ఐటీ ఉద్యోగులపై పోలీసు చర్యలు తీసుకోవడం నెగెటివ్‌గా మారిందా అన్న చర్చ కూడా జరుగుతోంది.

చంద్రబాబు అరెస్టు పక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడంతో కమ్మ ఓటర్లలో సందేహాలకు తావిచ్చినట్లైంది. అయితే ఈ విషయం త్వరగా గుర్తించిన బీఆర్ఎస్.. దివంగత సీఎం ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంద‌రికీ ఎన్టీఆర్ ఆరాధ్య దైవం.. ఎవ‌రు ఎన్ని చ‌రిత్రలు రాసినా కొన్ని చెరిగిపోని స‌త్యాలు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పింది ఎన్టీఆర్ మాత్రమే అంటూ మంత్రి కేటీఆర్ పొగడ్తలు కురిపించారు. ఖమ్మం నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఎన్టీఆర్ పేరు ద్వారా వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారన్నది బీఆర్ఎస్ ప్రత్యర్థుల నుంచి వస్తున్న విమర్శలు. అక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ సామాజికవర్గ ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి ఎన్టీఆర్ పేరును తెరమీదకు తీసుకురావాల్సి వచ్చిందనే చర్చ ఇప్పటికే మొదలైంది. అలాగే చంద్రబాబు అరెస్ట్‌పై ప్రత్యేకంగా కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతల్లోనూ పెద్ద చర్చే జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

అందుకే, ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి ఆ నియోజకవర్గంలో చంద్రబాబుకు మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సైతం బాన్సువాడలో జరిగిన ఒక కార్యక్రమం చంద్రబాబుపై సానుభూతి ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావు కూడా చంద్రబాబును అరెస్ట్ చేసి ఉండాల్సింది కాదంటూ మాట్లాడారు. ఖమ్మంలో మంత్రి కేటీఆర్‌ కూడా సీనియర్‌ ఎన్టీఆర్‌ పేరు ప్రస్తావించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు. ఇవన్నీ కమ్మ సామాజికవర్గ ఓట్ల కోసం జరిగిన కీలక పరిణామాలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇదంతా కాంగ్రెస్ కావాలని కమ్మం వర్గ నేతలను రెచ్చగొడుతోందన్న వెర్షనూ వినిపిస్తోంది. మరోవైపు రానున్న ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీని యాక్టివ్ చేస్తామని ఈ మధ్యనే బాలకృష్ణ ప్రకటించారు. ఇక్కడి కార్యకర్తలకి పోటీ చేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో అన్ని పార్టీలలో మరో టెన్షన్ మొదలైంది. ఇది అధికారపార్టీ బీఆర్ఎస్‌కు కాస్త చేదు వార్తేనన్నది విశ్లేషకుల మాట. దీనికి కారణం టీడీపీకి చెందిన క్యాడర్అంతా బీఆర్ఎస్‌వైపే మళ్లింది. అయితే చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిణామాలు మారడం..అలాగే అభ్యర్ధులను బరిలో దించుతామని చెప్పడంతో కచ్చితంగా ప్రభావం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదంతా గమనించే కాంగ్రెస్‌ కమ్మం వర్గాన్ని లైన్‌లోకి దించిందన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గ డిమాండ్‌పైనా రేవంత్‌ పేరు ప్రస్తావనకు వస్తోంది. తుమ్మల కాంగ్రెస్‌లో చేరిక వెనుక రేవంత్‌ ప్రముఖ పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో.. కమ్మ నేతలు వాళ్ల సీట్ల ప్రయత్నాలు రేవంత్‌ ద్వారానే నెరవేర్చుకోవాలని భావిస్తున్నారన్న వెర్షనూ వినిపిస్తోంది. తమ పాత పరిచయాలతో రేవంత్‌రెడ్డిని కలుస్తున్న కొందరు.. తమ సీట్లకు పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పించే బాధ్యతను అప్పజెప్పినట్లు కూడా వార్తలొస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గాన్ని రేవంత్ టీమే రెచ్చగొట్టి మరీ ఢిల్లీకి పంపిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ట్రాప్‌లో కమ్మలు పడ్డారని ఆరోపిస్తోంది. ఇక బీజేపీ సైతం ఆర్ధికంగా, రాజకీయంగా ప్రభావం చూపే కమ్మ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుందనే చర్చ చాలాకాలం నుంచి జరుగుతోంది. అందులో భాగంగానే ఆ సామాజిక వర్గానికి చెందిన ఎన్టీఆర్ మనవడు, జూనియర్ ఎన్టీఆర్‌ను బీజేపీ అగ్రనేత అమిత్‌షా ఆమధ్య కలిసారన్న చర్చా జరుగుతోంది.

సామాజిక వర్గాలకు కేవలం ఓటు అధికారం మాత్రమే కాదని.. వారికి సీట్ కూడా ఇవ్వాలంటున్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ రేణుక చౌదరి. పరిశ్రమలు, సినిమా, మీడియా రంగాల్లో ఉన్న కమ్మ వారికి రాజకీయాల్లో కూడా తగిన ప్రాతినిథ్యం ఉండాలని రేణుక అభిప్రాయపడ్డారు. మరోవైపు కమ్మవారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. మొత్తానికి తెలంగాణలో కమ్మ సామాజికవర్గం డిమాండ్ రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. ఇదేమీ టీకప్పులో తుపాన్ లాంటిది కాదని.. చినికి చినికి గాలివానగా మారేంత ప్రమాదం రాజకీయంగా కనిపిస్తోందన్నది పొలిటికల్ ఫాలోయర్స్ మాట. ఈనేపథ్యంలో కమ్మఓటు ఇప్పుడు ఎటు ట్రాన్స్‌ఫర్ అవుతుందన్న దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. మరి చూడాలి…ఏపార్టీ కమ్మల డిమాండ్‌ కు ఓకే చెబుతుందో…అది రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?