AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Weather: తెలంగాణకు రెయిన్‌ అలెర్ట్‌.. రాగల కొన్ని గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

Telangana Rains: నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోనూ వరుణుడు క్రమంగా జోరు చూపిస్తున్నాడు. ఈనేపథ్యంలో రాగల 3 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని..

Telangana Weather: తెలంగాణకు రెయిన్‌ అలెర్ట్‌.. రాగల కొన్ని గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
Rain Alert
Basha Shek
|

Updated on: Jun 25, 2022 | 6:07 PM

Share

Telangana Rains: నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోనూ వరుణుడు క్రమంగా జోరు చూపిస్తున్నాడు. ఈనేపథ్యంలో రాగల 3 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అదిలాబాద్‌, కుమరంభీమ్‌, నిర్మల్‌, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాల పల్లి, ములుగు, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, సిద్ధిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, బి.కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్‌, మల్కాజగిరి, వై.భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

జీహెచ్ఎంసీ అప్రమత్తం..

కాగా శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో వర్షం కురిసింది.  నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెగని వర్షాలు కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 040-29555500కు కాల్ చేయాలని సూచించింది. వానలు కురుస్తున్న పలు ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో వర్షాకాలం లో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కరించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు జోనల్, అడిషనల్ కమిషనర్ ల ఇంజనీరింగ్ అధికారుల తో మేయర్ శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ .. ‘వర్షాల నేపథ్యం లో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ఎప్పటి కప్పుడు చెత్త తొలగించాలి , నాలా ల వద్ద ప్రమాదాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తల లో బాగంగా నాలా ల వద్ద హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేయాలి. యస్ ఎన్ డి పి పనులు కొనసాగించేందుకు విభాగాల అధికారుల సమన్వయం సమావేశాలు నిర్వహించాలి. అందుకు కావల్సిన మేన్ మెటీరియల్ సిద్దంగా పెట్టుకోవాలి.  మాన్సూన్ ఆక్షన్ టీమ్ లు అప్రమత్తంగా ఉండాలి. వర్షం పడుతున్న సందర్భం లో అందుబాటు లో ఉండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా సహాయక చర్యలు చేపట్టాలి.  వర్షాల నేపథ్యం లో ట్విట్టర్, ఫోన్ కాల్స్, ప్రజా ఫిర్యాదుల స్వీకరించి  సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి.  లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్య ఏర్పడినప్పుడు కావాల్సిన పునరావాస చర్యలు తీసుకోవాలి.  వర్షా కాలం లో జోనల్ స్థాయిలో హెల్ప్ లైన్( కంట్రోల్ రూమ్) ఏర్పాటు చేయాలి’ అని జోనల్ కమిషనర్ లను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..