AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brand Hyderabad: తగ్గేదే లే.. కరోనా కష్టకాలంలోనూ దూసుకుపోయిన హమారా హైదరాబాద్..

హైదరబాద్‌ అంటేనే సకల జాతుల, ప్రాంతాల సమ్మెళనం. ఇక్కడి సానుకూల పరిస్థితులు.. బౌగోళికం.. వాతావరణం.. అన్నీ కలసి వేగంగా అభివృద్ధిని సాధించిన నగరంగా నిలిచిపోయింది. కానీ కరోనా కష్టకాలం ఈ నగరానికి కొండంత కష్టాన్నే తెచ్చింది.

Brand Hyderabad: తగ్గేదే లే.. కరోనా కష్టకాలంలోనూ దూసుకుపోయిన హమారా హైదరాబాద్..
Representative Image
Ganesh Y - Input Team
| Edited By: Janardhan Veluru|

Updated on: Jun 25, 2022 | 6:01 PM

Share

Hyderabad Positive: కరోనా ఫస్ట్ వేవ్..సెకండ్‌ వేవ్‌.. థర్డ్ వేవ్.. ఈ విపత్కర కాలాల్ని తల్చుకుంటే నిజంగానే వెన్నులో వణుకుపుడుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా అన్నీ మూలపడ్డాయి. దానితో పాటే ఆర్థిక వ్యవస్థ.. అభివృద్ధి కూడా.. కానీ నేలకు కొట్టిన బంతిలా.. పడిలేచిన కెరటంలా మళ్లీ పురోగమనం ప్రారంభమైంది. అందులో దేశంలోనే అతి త్వరగా కోలుకుని పరుగులు ప్రారంభించిన నగరాల్లో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలుస్తోంది. ఏకంగా ముంబై తర్వాత వేగంగా ముందుకు వెళుతున్న నగరంగా నిలబడింది మన హైదరాబాద్ నగరం. ఇంతకీ ఏఏ రంగాలు అడుగులు ప్రారంభించాయి. ఏఏ రంగాలు ఎలా పరుగులు పెడుతున్నాయి.

హైదరబాద్‌ అంటేనే సకల జాతుల, ప్రాంతాల సమ్మెళనం. ఇక్కడి సానుకూల పరిస్థితులు.. బౌగోళికం.. వాతావరణం.. అన్నీ కలసి వేగంగా అభివృద్ధిని సాధించిన నగరంగా నిలిచిపోయింది. కానీ కరోనా కష్టకాలం ఈ నగరానికి కొండంత కష్టాన్నే తెచ్చింది. అయినా వైరస్‌ వేవ్‌ లను… లాక్‌ డౌన్‌ పరిస్థితులను నిలదొక్కుకుని నిలబడిని నగరాల్లో హైదరాబాద్‌ దేశంలోనే రెండో స్థానంలో నిలుస్తోంది. దేశంలో వివిధ నగరాలలో జరిగిన అధ్యయనాల్లో ముంబై నగరం ప్రథమ స్థానంలో నిలిస్తే .. హైదరాబాద్‌ నగరం రెండో స్థానంలో నిలబడి.. మొదటి స్థానానికి చేరడానికి పరుగులు ప్రారంభిస్తోంది. హైదరాబాద్‌ తర్వాత స్థానాల్లో బెంగళూరు, చెన్నై, పూణె, ఢిల్లీ, కోల్‌ కత్తా, అహ్మదాబాద్‌ నిలుస్తున్నాయి.

ఇంతకీ… హైదరాబాద్‌ ఏఏ రంగాల్లో ముందుకు వెళుతోంది. ఏఏ రంగాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. వివిధ పరిశ్రమల్లో.. ముడిసరుకులు..లేబర్‌..పెట్టుబడులు ఎలా ఉన్నాయి. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లోనే ప్రత్యేకత ఉన్న హైదరాబాద్‌ లో వివిధ సెక్టార్ల పరిస్థితి ఏంటి? ఇప్పటికే సాఫ్ట్ వేర్‌ రంగం జనవరి తరువాత కానీ తన పరుగులు పూర్తి స్థాయిలో ప్రారంభించదని స్పష్టత వచ్చిన నేపథ్యంలో మిగిలిన రంగాలు .. హైదరాబాద్‌ గ్రోత్‌ ను ఏవిధంగా ముందుకు తీసుకెళుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రధానంగా పరిశ్రమలు. ఒకటా రెండా… ఏటా హైదరాబాద్‌ లో చిన్నా పెద్దా పరిశ్రమలు సుమారు 8 నుంచి 9వేల వరకూ రిజిస్ట్రర్‌ అవుతునే ఉంటాయి. ఇందులో సిక్‌ ఇండస్ట్రీస్ ను పక్కన పెడితే… చాలా వరకూ పరిశ్రమలు నిలదొక్కుకుని… జాతీయ స్థాయిలో పోటీనిస్తున్నాయి. ఫార్మా మొదలు… భారీ వస్తు పరిశ్రమల వరకూ హైదరాబాద్‌ సెంటర్‌. అయితే.. కరోనా కాలం నిజంగానే కుదేలు చేసింది. అయితే.. ఇప్పుడు అనేక రంగాలు కోలుకుని… ఉత్పత్తిని ప్రారంభించాయి. ఇదే విషయాన్ని ఫెడరేషన్‌ ఆఫ్ తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్ మార్స్ అండ్‌ ఇండస్ట్రీ (FTCCI)స్పష్టంచేస్తోంది. కరోనా కాలంలో అధిగమించి ప్రయాణం సాగుతోందంటున్నారు ఇండస్ట్రీయల్‌ డెవెలెప్‌మెంట్‌ కమిటి, తెలంగాణ(FTCCI)చైర్మన్‌ గరిమెళ్ల శ్రీనివాస్‌.

హైదరాబాద్‌ నిర్మాణ రంగం అంటేనే… ఓ ప్రత్యేకత. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్‌ ఉండటంతో ఇక్కడ నిర్మాణరంగానికి తిరుగులేకుండా పోయింది. మరోవైపు… ముంబై, బెంగళూరు, ఢిల్లీ ప్రాంతాలతో పోల్చితే ల్యాండ్‌ కాస్ట్ కూడా ఇక్కడ ఈ రంగం దూసుకుపోడానికి కారణమైంది. అయితే.. కరోనా తీవ్రతతో గందరగోళపడిన నిర్మాణ రంగం.. ఇప్పుడు గత వైభవం వైపు ప్రయాణం ప్రారంభించింది. ఏకంగా 140శాతంగ్రోత్‌ రేటు ఈరంగంలో సాధించినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిజంగా కష్టకాలాన్ని అధిగమించామంటున్నారు తెలంగాణ క్రెడాయ్‌ చైర్మన్ రామాచంద్రారెడ్డి. అధ్యయన గణాంకాలకు తగ్గట్టుగానే క్షేత్ర స్థాయిలో కన్‌స్ట్రక్షన్ రంగం పనులు కన్పిస్తున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన భవన సముదాయాల నిర్మాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి. బహుళ అంతస్తుల నిర్మాణాలేకాదు.. మధ్య తరగతి గృహ నిర్మాణాలు సైతం వేగం పుంజుకున్నాయి. అనేక …నిర్మాణాలు సాగుతున్నాయి.

భారీ, మధ్య తరగతి పరిశ్రమలే కాదు.. సూక్ష్మ పరిశ్రమలకు హైదరాబాద్‌ కేంద్రమే. దేశంలోని అనేక బడా సంస్థలకు ఇక్కడి నుంచే వివిధ ఇంజనీరింగ్‌ వస్తువులు తయారవుతాయి. గుండుసూది నుంచి.. విమానాల బాల్ బేరింగ్స్ వరకూ ఇక్కడ తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. కరోనా లాక్‌ డౌన్‌ కాలంలో అతిపెద్ద కష్టాన్ని ఎదుర్కొన్న రంగంలో ఇది కూడా ఒకటి. బాల్‌ నగర్‌, ఫతేనగర్‌, సనత్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఈ సూక్ష్మ పరిశ్రమలు ఉన్నాయి. అవును … ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. అయితే..మరింత కోలుకోడానికి ఈ పరిశ్రమలను ఇక్కడ నుంచి ఒక ప్రత్యేక ప్రాంతానికి తరలించి వసతులు ఇవ్వాలనే డిమాండ్‌ ను ఈ రంగం తెరపైకి తెస్తోందంటున్నారు హైదరాబాద్‌ సూక్ష్మ పరిశ్రమలు ప్రెసిడెంట్ సునీల్‌. ఇలా భారీ పరిశ్రమల నుంచి సూక్ష్మపరిశ్రమల వరకూ …. తమ మరయంత్రాలకు తప్పు వదిల్చి…. ఉత్పత్తి ని చేస్తున్నాయి. ఎక్కడ చూసినా… వివిధ పరిశ్రమల్లో యంత్రాలు చకచకా కదులుతున్నాయి.. కార్మికులు పనుల్లో నిమగ్నమై… నూతన వస్తువుల ఉత్పత్తికి మమేకమై కన్పిస్తున్నారు.

ఎక్కడెక్కడ నుంచో హైదరాబాద్‌ కు రెక్కలు కట్టుకుని వాలిపోయి… వివిధ రంగాల్లో పనులుచేసే వారు.. కరోనా కాలంలో కనిపించకుండా పోయారు. సొంతూళ్లకు వెళ్లిపోయి తిరిగిరామన్నారు. కానీ ఈ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ఈ మార్పే.. హైదరాబాద్‌ గ్రోత్‌ మళ్లీ పుంజుకుని ప్రయాణించడానికి ప్రధాన భూమికగా మారింది.

హైదరాబాద్‌ కు తెలంగాణలోని జిల్లాల నుంచే కాదు.. ఆంధ్రా, ఒడిస్సా, చతిస్గడ్‌, బీహార్‌, కర్ణాటక, కేరళ, చెన్నై… ఇలా అనేకరాష్ట్రాలనుంచి వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న వారు ఇక్కడి పరిశ్రమల్లో భాగస్వాములయి..జీవనాన్ని సాగిస్తున్నారు. కరోనా పరిస్థితులు కొంత చక్కబడటంతో పనులు ప్రారంభించారు. అప్పటి పరిస్థితుల నుంచి బయటపడ్డామంటున్నారు. ఏడాది కాలంలో పనుల నిలిచిపోయాయి. అతి చిన్నదైనాపెద్దదైనా… చాలా నష్టం జరిగింది. చివరికి జీవనోపాది కూడా ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు ఆ పరిస్థితుల నుంచి గట్టెక్కి పనులు ప్రారంభమయ్యాయి. నష్టాల నుంచి మళ్లీ కోలుకుంటున్నామంటున్నారు మరికొన్ని రంగాలు చెందిన వారు.

ఇలా ఒకటా రెండా అన్ని రంగాలు గడ్డు కాలాన్ని జయించాయి. అన్ని రంగాలు ఉత్పత్తిని సాధించాయి. ఆనాటి పరిస్థితులను ఈనాటితో పోల్చితే నిజంగా ఏ స్థాయిలో ధైర్యంగా ముందుకు ప్రయాణిస్తున్నామో అంచనాలు వేయవచ్చు అంటున్నారు హైదరాబాద్‌ ఫోరంఫర్‌ గుడ్‌ గవర్నెన్స్ ప్రధాన కార్యదర్శ పద్మనాభరెడ్డి. ఈపరిస్థితులన్నీ… పడిలేచిన కెరటంలా కన్పిస్తున్నాయి. ఇప్పటికే … దేశంలో రెండో స్థానానికి చేరుకున్న హైదరాబాద్‌ గ్రోత్.. మొదటి స్థానానికి చేరడానికి ఎక్కువ కాలం పట్టదంటున్నాయి.

(గణేష్‌. వై, టివి9 తెలుగు, హైదరాబాద్‌)

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..