AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ ప్రభుత్వాస్పత్రుల జోరు.. మరో 13 ఆస్పత్రులకు జాతీయ స్థాయిలో గుర్తింపు

తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులకు జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ వైద్య సేవల్లో నాణ్యత ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని అన్నారు.

Telangana: తెలంగాణ ప్రభుత్వాస్పత్రుల జోరు.. మరో 13 ఆస్పత్రులకు జాతీయ స్థాయిలో గుర్తింపు
Finance Minister Harish Rao
Surya Kala
|

Updated on: Jun 25, 2022 | 4:57 PM

Share

Telangana: స్వరాష్ట్రంలో.. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతం అయిందని, పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతుందని మరోసారి నిరూపితం అయిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు చెప్పారు. రాష్ట్రంలోని మ‌రో 13 ప్రభుత్వ ఆసుపత్రులు ఎన్‌క్వాష్ (నేష‌న‌ల్ క్వాలిటీ అష్యురెన్స్ స్టాండ‌ర్డ్స్‌ – NQAS) స‌ర్టిఫికేట్లు సాధించగా.. మరో మూడు ఆస్పత్రులకు రీ సర్టిఫికేషన్ వచ్చిందని అన్నారు. లేబర్ రూమ్, ఆపరేషన్ ధియేటర్ నిర్వహణలో అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకు నిర్మల్ ఏరియా ఆసుపత్రి “లక్ష్య” గుర్తింపు లభించిందని తెలిపారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు శుభాకాంక్షలు తెలిపిందన్నారు మంత్రి హ‌రీశ్ రావు.

తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులకు జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ వైద్య సేవల్లో నాణ్యత ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ జాతీయ స్థాయి గుర్తింపు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో పీహెచ్‌సీ స్థాయి నుంచి ప్రజ‌ల‌కు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్ర వైద్యారోగ్య రంగం దేశానికే ఆద‌ర్శంగా మారుతున్నదని పేర్కొన్నారు.

కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైన జాతీయ స్థాయి నాణ్యత ప్రమాణాల గుర్తింపును తెలంగాణలోని జిల్లా, ప్రాంతీయ, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సాధిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేస్తున్న వైద్యారోగ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. తాజాగా వచ్చినవి కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం 143 ఆసుప‌త్రుల‌కు ఎన్‌క్వాష్ గుర్తింపు వ‌చ్చిందని, ఈ గుర్తింపు క‌లిగిన ఆసుప‌త్రులు అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుప‌త్రుల‌కు ఈ గుర్తింపు కోసం ప్రభుత్వం కృష్టి చేస్తున్నదనీ, ఆ దిశ‌గా అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. దేశంలో మొదటి స్థానంలో నిలవడం లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

“స్వరాష్ట్రంలో ప్రభుత్వం వైద్యారోగ్య రంగాన్ని ప‌టిష్టం చేస్తున్నది. దీంతో ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో మౌలిక వ‌స‌తులు పెరిగాయి. విలువైన వైద్య ప‌రిక‌రాలు అందుబాటులోకి వ‌చ్చాయి. ఓపీ, ఐపీ, స‌ర్జిక‌ల్ ఇలా అన్ని విభాగాల్లో నాణ్యత పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రజ‌ల‌కు ఉచితంగా, నాణ్యమైన వైద్య సేవ‌లు అందుతున్నాయి.” అని మంత్రి హరీష్ రావు  పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us