Telangana: తెలంగాణ టీచర్లకు షాక్.. పాఠశాల విద్యాశాఖ సంచలన ఆదేశాలు

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. టీచర్ల ఆస్తుల వివరాలను విద్యాశాఖ కోరింది. మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.

Telangana: తెలంగాణ టీచర్లకు షాక్.. పాఠశాల విద్యాశాఖ సంచలన ఆదేశాలు
Telangana Teachers
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 25, 2022 | 5:28 PM

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పట్నుంచి ఒక లెక్క.  తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ టీచర్లకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. టీచర్స్ అందరూ ఆస్తుల వివరాలు వెల్లడించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఏడాదికోసారి ఆస్తుల వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. ఇకపై టీచర్లు ఇళ్లు, ప్లాట్లు కొనాలన్నా..అమ్మాలన్నా సంబంధిత అధికారులకు చెప్పాలని సూచించించింది. కేవలం, ఇళ్లు, ప్లాట్ల లావాదేవీలే కాదు… బంగారం, ఆభరణాలు, ఇతర ఖరీదైన వస్తువులు ఏమైనా కొనాలన్నా సంబంధిత అధికారికి వివరాలు సమర్పించాల్సిందే. లేదంటే, ఆయా టీచర్స్‌పై చర్యలు ఉంటాయంటోంది. టీచర్లందరూ వార్షిక ప్రాపర్టీ స్టేట్‌మెంట్‌ను విద్యాశాఖకు సమర్పించాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి టీచర్లు, ఉద్యోగులకు ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వాలని ఆర్జేడీ, డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల నల్గొండ జిల్లా దేవరకద్ర మండలం గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావీద్‌ అలీపై ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంతకీ ఈ సర్క్యూలర్ ఏముంది? – APCS (1964) సర్వీస్‌ రూల్స్‌ 9లోని సబ్‌రూల్‌ను గుర్తు చేసిన సర్క్యూలర్‌ – టీచర్లంతా ఏడాదికోసారి ఆదాయం లెక్కలు చూపించాల్సిందే – స్థిర, చర ఆస్తులు అమ్మినా, కొన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి – ఇండిపెండెంట్‌ ఇల్లు, ఫ్లాట్‌, షాప్‌, నివాసస్థలం, వ్యవసాయభూమి కొన్నా అమ్మినా అనుమతి తీసుకోవాల్సిందే – తన పేరుమీద, కుటుంబీకుల పేరు మీద కొన్నాసరే లెక్కలు చూపించాలి – కొనడానికి తగిన ఆదాయవనరు లెక్కలు చూపించాలి..!

సమర్పించాల్సిన లెక్కలేంటి? – కారు, మోటార్‌సైకిల్‌, ఇతర వాహనం ఏది కొన్నా చెప్పాల్సిందే – ఏసీ, టీవీ, వీసీఆర్‌, ఫ్రిజ్‌.. ఇతర ఎలక్ట్రానిక్‌ గూడ్స్ ఏం కొన్ని చెప్పాల్సిందే – బంగారం, వెండి, ఆభరణాలు, పాత్రలు ఏం కొన్నా చెప్పాల్సిందే – బ్యాంక్‌ డిపాజిట్స్‌, బ్యాంక్‌ బ్యాలెన్స్‌లు, ఇతర పెట్టుబడుల గుట్టు విప్పాల్సిందే

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఇష్యూ చేసిన సర్క్యులర్‌లోని అంశాలు పాతవే అయినా, ఇప్పుడు జారీ చేయడం మాత్రం సంచలనం రేపుతోంది. మూడేళ్ల క్రితం ఇలాంటి సర్క్యులర్‌నే ఇచ్చిందని, అంతకుముందు కూడా ఇలాంటి సర్క్యులర్స్‌ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయంటున్నారు. అయితే, సర్క్యులర్ ఇవ్వడం, చేతులు దులుపుకోవడం మాత్రమే చేస్తున్నారని అంటున్నారు తెలంగాణ యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి చావా రవి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టీచర్స్‌ అసెట్స్‌కు సంబంధించి డేటా సేకరించాలని డిమాండ్ చేస్తున్నారు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!