Hyderabad: పుప్పాల గూడలో దారుణం.. నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి.. శ్రీకాకుళం వాసులుగా గుర్తింపు
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు తోడు.. సెల్లార్ గుంత తీయడంతో గోడ కూలినట్లు.. ఆ గుంతలో పడి కూలీలు మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Hyderabad: రంగారెడ్డి జిల్లా (Rangareddy District) నార్సింగి (narsingi) పీఎస్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పుప్పాల గూడలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు తోడు.. సెల్లార్ గుంత తీయడంతో గోడ కూలినట్లు.. ఆ గుంతలో పడి కూలీలు మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు శ్రీకాకుళంకు చెందినవారుగా పోలీసులు నిర్దారించారు.
సెల్లార్ కోసం స్లాబ్ వేసేందుకు రాడ్ పనులు చేస్తున్న సమయంలో హఠాత్తుగా పై నుంచి మట్టి కార్మికులపై పడిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ ప్రమాద సమయంలో అక్కడ ఐదుగురు కార్మికులు పనిచేస్తున్నారని సమాచారం. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే ఈ దారుణానికి కారణం అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటన సంస్థలం వద్ద శిథిలాల తొలగింపు ప్రక్రియ ముగిసిందని అసిస్టెన్స్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గిరిధర్ రెడ్డి చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్టు ప్రకటించారు.
మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మట్టి గోడ కూలిన సమయం లో ఐదుగురు పని చేస్తున్నట్టు నార్సింగ్ ci శివ కుమార్ చెప్పారు. ప్రస్తుతం నిర్మాణ సంస్థ సూపర్ వైజర్ ని విచారిస్తున్నామని తెలిపారు. మృతదేహాలను ఉస్మానియా కి తరలించి … కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని తెలిపారు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..