Viral Video: ఔటవ్వగానే వేలు చూపిస్తూ అసభ్యకర సంజ్ఞలు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న ఫ్యాన్స్‌.. వైరలవుతోన్న వీడియో..

Tamilnadu Premier League 2022: ఏఆటలోనైనా గెలుపోటములు సహజం. అన్నిటినీ సమానంగా తీసుకోవాలి. పరాజయాలు ఎదురైనా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలి. తోటి ఆటగాళ్లను గౌరవించాలి. అప్పుడే ఏదో ఒకరోజు మనం అనుకున్న లక్ష్యానికి చేరుకుంటాం.

Viral Video: ఔటవ్వగానే వేలు చూపిస్తూ అసభ్యకర సంజ్ఞలు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న ఫ్యాన్స్‌.. వైరలవుతోన్న వీడియో..
Tamilnadu Premier League
Follow us

|

Updated on: Jun 24, 2022 | 12:29 PM

Tamilnadu Premier League 2022: ఏఆటలోనైనా గెలుపోటములు సహజం. అన్నిటినీ సమానంగా తీసుకోవాలి. పరాజయాలు ఎదురైనా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలి. తోటి ఆటగాళ్లను గౌరవించాలి. అప్పుడే ఏదో ఒకరోజు మనం అనుకున్న లక్ష్యానికి చేరుకుంటాం. అయితే ఈ విషయాన్ని పట్టించుకోని కొందరు ఆటగాళ్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఆటగాళ్లు, అంపైర్లతో మైదానంలోనే గొడవపడుతున్నారు. తాజాగా తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ 2022లో కూడా అలాంటి సంఘటనే జరిగింది. తిరునల్వేలి వేదికగా ఇండియన్‌ సిమెంట్‌ కంపెనీ గ్రౌండ్‌లో చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌ ఓపెనర్‌ ఎన్‌. జగదీశన్‌ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. క్రికెట్‌ ఫ్యాన్స్‌ అతనిపై మండిపడుతున్నారు. నిబంధనలు, రూల్స్ నచ్చకపోతే క్రికెట్‌ ఆడడం మానేసెయ్‌.. అంతేగానీ మరీ ఇంత నీచంగా దిగజారి ప్రవర్తించకు’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఇంతకీ మ్యాచ్‌లో ఏం జరిగిందంటే..

క్రికెట్‌ రూల్స్‌ తెలియవా?

ఇవి కూడా చదవండి

చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌, నెలాయి రాయల్‌ కింగ్స్‌ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చెపాక్‌ జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. రాయల్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన చెపాక్‌ జట్టు కూడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 184 పరుగులే చేయడంతో మ్యాచ్‌ టై అయింది. దీంతో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా రాయల్‌ కింగ్స్‌ విజయం సాధించింది. అయితే చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌ ఇన్నింగ్స్‌ సాగుతుండగా ఆ జట్టు ఓపెనర్‌ ఎన్‌. జగదీశన్‌ వ్యవహరించిన తీరుపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ గుర్రుగా ఉన్నారు. ప్రత్యర్థి జట్టు ఆటగాడి పట్ల అతను వ్యవహరించిన తీరే ఇందుకు కారణం. చెపాక్‌ ఇన్నింగ్స్‌ సమయంలో 3.4వ ఓవర్‌లో బాబా అపరాజిత్‌ బౌలింగ్‌కు రాగా.. కౌశిక్‌ గాంధీ క్రీజులో ఉన్నాడు. అయితే, అపరాజిత్‌ బంతి వేయకముందే నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న జగదీశన్‌ క్రీజును వదిలి బయటకు వచ్చాడు. దీంతో అపరాజిత్‌ జగదీశన్‌ మన్కడింగ్‌ చేసి పెవిలియన్‌కు పంపించాడు. ఈ సందర్భంగా తీవ్ర నిరాశకు లోనైన జగదీశన్‌ వేలిని చూపిస్తూ అసభ్యకర సంజ్ఞలు చేస్తూ మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో క్రికెట్‌ అభిమానులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘తోటి ఆటగాళ్ల పట్ల నువ్వు ఇలాగేనా ప్రవర్తించేది?’, ‘క్రికెట్‌ నిబంధనలు తెలుసుకోని మైదానంలోకి అడుగుపెట్టు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇలా మన్కడింగ్‌ ఔట్‌తో వివాదాలు రాజుకోవడం క్రికెట్లో కొత్తేమీ కాదు. గతంలో ఇదే విషయమై రవి చంద్రన్‌ అశ్విన్‌, జోస్‌ బట్లర్‌ల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. కాగా క్రికెట్‌ చట్టాలు చేసే మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసిన విషయం తెలిసిందే. ఎంసీసీ చేసిన సవరణలకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి కూడా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..