Cricket: విజయానికి 9 పరుగులు.. చేతిలో 6 వికెట్లు.. నరాలు తెగే ఉత్కంఠ.. సీన్ కట్ చేస్తే!

విజయానికి 9 పరుగులు.. చేతిలో 6 వికెట్లు.. ఉన్నవి 6 బంతులు.. ఇంకేముంది బ్యాటింగ్ చేస్తోన్న జట్టు ఈజీగా గెలుస్తుందని..

Cricket: విజయానికి 9 పరుగులు.. చేతిలో 6 వికెట్లు.. నరాలు తెగే ఉత్కంఠ.. సీన్ కట్ చేస్తే!
Cricket News
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 24, 2022 | 12:22 PM

విజయానికి 9 పరుగులు.. చేతిలో 6 వికెట్లు.. ఉన్నవి 6 బంతులు.. ఇంకేముంది బ్యాటింగ్ చేస్తోన్న జట్టు ఈజీగా గెలుస్తుందని అని అంటారా.? అయితే ఇక్కడే అసలు ట్విస్ట్.. ఫైనల్ ఓవర్.. థ్రిల్లర్ సినిమాను తలపించింది. నరాల తెగే ఉత్కంఠతో మ్యాచ్ పూర్తయింది. ఆ కథేంటో చూసేద్దాం పదండి..

ఇటీవల విటాలిటీ టీ20 బ్లాస్ట్‌లో జరిగిన సోమర్‌సెట్, సర్రీ మధ్య మ్యాచ్ ఓ థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్‌సెట్ నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. టామ్ బాండన్(39) జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక అనంతరం 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సర్రీ 19 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో ఆ జట్టుకు విజయం సాధించాలంటే 9 పరుగులు అవసరం. సోమర్‌సెట్.. లాస్ట్ ఓవర్ సీనియర్ బౌలర్ అయిన సిడిల్‌కు ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

తొలి బంతికి సింగిల్.. ఆ తర్వాత బంతికి వికెట్.. మూడో బంతి బౌండరీ.. దీనితో సర్రీ విజయానికి లాస్ట్ 3 బంతుల్లో 4 పరుగులు అవసరమయ్యాయి. అయితే సిడిల్ వేసిన 4, 5 బంతుల్లో సర్రీ రెండు వికెట్లు కోల్పోయింది. అంతే.. ఒక్కసారిగా మ్యాచ్‌లో నరాలు తెగే ఉత్కంఠ మొదలైంది. అయితే ఆఖరి బంతికి కాన్‌ మెకర్‌ ఫోర్ కొట్టడంతో.. సర్రీ జట్టు ఊపిరి పీల్చుకుంది.

సోమర్‌సెట్‌పై అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆ మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరూ ఓ లుక్కేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!