IRE Vs IND: ఆ 5గురి ప్లేయర్స్‌తో జాగ్రత్త.. లేదంటే టీమిండియా గెలవడం కష్టమే!
భారత్.. ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ డబ్లిన్ వేదికగా జూన్ 26న జరగనుంది.
మరో అగ్ని పరీక్షకు టీమిండియా యువ ప్లేయర్స్ రెడీ అవుతున్నారు. హార్దిక్ పాండ్యా సారధ్యంలో భారత్.. ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ డబ్లిన్ వేదికగా జూన్ 26న జరగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో.. యువ ఆటగాళ్లు బరిలోకి దిగబోతున్నారు. అయితే ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేయడం సరికాదు. ఏ విభాగంలోనైనా తప్పు జరిగిందంటే.. ఐర్లాండ్.. భారత్‌పై తొలి సిరీస్ విజయం నమోదు చేయడం లాంచనమే.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఐర్లాండ్ జట్టు భారత్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు 14 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఆ జట్టు తరపున స్టీఫెన్ డోహెనీ, పేస్ బౌలర్ కోనార్ ఓల్‌ఫెర్ట్ అంతర్జాతీయ అరంగేట్రం చేయనుండగా.. ఓ ఐదుగురు ప్లేయర్స్ టీమిండియాపై తమ అసాధారణ ఆటతీరును ప్రదర్శించేందుకు సిద్దంగా ఉన్నారు. వాళ్లపై ఓ లుక్కేద్దాం..
ఆండ్రూ బల్‌బెర్ని:
ఐర్లాండ్ జట్టు కెప్టెన్‌గా ఆండ్రూ బల్‌బెర్నికు అపారమైన అనుభవం ఉంది. ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకున్నాడంటే.. మరో ఆటగాడితో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పడమే కాకుండా.. జట్టుకు భారీ స్కోర్ అందించడంలో తన వంతు పాత్ర పోషించగలడు. ఇప్పటివరకు 67 టీ20లు ఆడిన బల్‌బెర్ని 5 అర్ధ సెంచరీలతో 1429 పరుగులు చేశాడు.
కర్టిస్ కాంఫర్:
ఈ యువ ఐరిష్ ఫాస్ట్ బౌలర్.. అటు బ్యాట్.. ఇటు బంతితో మెరుపులు మెరిపించగలడు. 2020 జూన్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కాంఫర్.. 2021 అక్టోబర్‌లో నెదర్లాండ్స్‌పై తొలి హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. ఇప్పటివరకు 12 టీ20లు ఆడిన కాంఫర్ 169 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు పడగొట్టాడు.
పాల్ స్టిర్లింగ్:
ఈ ఐరిష్ విధ్వంసకర ఓపెనర్.. డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. కచ్చితంగా చెప్పాలంటే టీమిండియా సిరీస్‌లో ఇతడే కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. బౌలర్ ఎవరైనా కూడా స్టిర్లింగ్ మొదటి బంతి నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. అనేక ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీలు ఆడిన అనుభవం ఉన్న స్టిర్లింగ్.. ఇప్పటిదాకా 102 అంతర్జాతీయ టీ20ల్లో 2776 పరుగులు చేయడంతో పాటు 20 వికెట్లు కూడా పడగొట్టాడు.
గ్రేత్ డెన్లీ:
ఐర్లాండ్ జట్టులో కీలక ఆటగాడు గ్రేత్ డెన్లీ. 2019లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ ప్లేయర్.. ఇటీవల జరిగిన స్కాట్‌ల్యాండ్, నెదర్లాండ్స్ ట్రై సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. ఇప్పటివరకు 37 మ్యాచ్‌లు ఆడిన డెన్లీ 694 పరుగులు చేశాడు.
మార్క్ అడైర్:
ఈ ఐరిష్ పేస్ బౌలర్.. పదునైన బంతులతో ప్రత్యర్ధులను ముప్పుతిప్పలు పెట్టడందిట్ట. 26 ఏళ్ల అడైర్.. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో తన సత్తా చాటుతూ వస్తున్నాడు. ఇప్పటివరకు 39 మ్యాచ్‌లు ఆడిన అడైర్.. అద్భుత ఎకానమీ తో 59 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ ఐదుగురు ప్లేయర్స్ సత్తా చాటితే.. టీమిండియాకు గట్టి పోటీ తప్పదని క్రికెట్ విశ్లేషకుల మాట. మరి హార్దిక్ పాండ్యా టీం ఎలా ఆడుతుందో వేచి చూడాలి.