AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TNPL 2022: రెండేళ్ల తర్వాత క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్న ఆటగాడు.. అందుకే వస్తున్నాని వెల్లడి..

కొంత మంది క్రికెటర్లు లేట్‌ వయస్సులో క్రికెట్‌ ఆడతారు. అలాంటి వాళ్లలో టీమిండియా వెటరన్‌ ఆటగాడు, తమిళనాడుకు చెందిన మురళీ విజయ్...

TNPL 2022: రెండేళ్ల తర్వాత క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్న ఆటగాడు.. అందుకే వస్తున్నాని వెల్లడి..
Cricket
Srinivas Chekkilla
|

Updated on: Jun 24, 2022 | 11:44 AM

Share

కొంత మంది క్రికెటర్లు లేట్‌ వయస్సులో క్రికెట్‌ ఆడతారు. అలాంటి వాళ్లలో టీమిండియా వెటరన్‌ ఆటగాడు మురళీ విజయ్‌ ఒకడు. అతను దాదాపు రెండేళ్ల తర్వాత క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో రూబీ ట్రిచీ వారియర్స్ తరపున ఆడేందుకు విజయ్‌ సిద్ధమయ్యాడని వార్తలు వస్తున్నాయి. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌-2022 తిరునెల్వేలి వేదికగా జాన్‌ 23న ప్రారంభమైం‍ది. కాగా విజయ్‌ చివరగా ఐపీఎల్‌-2020 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున బరిలోకి దిగాడు. తర్వాత అతడు పూర్తిగా క్రికెట్‌కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో తన రీ ఎంట్రీపై విజయ్‌ తాజాగా మాట్లాడాడు. “నేను వీలైనంత ఎక్కువ కాలం క్రికెట్‌ ఆడాలనుకుంటున్నాను. నేను యువకులతో కలిసి ఆడబోతున్నాను. నా అనుభావాన్ని వాళ్లతో పంచుకుని ముందుకెళ్తాను” అని విజయ్‌ చెప్పాడు.

ఇక 2008లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌లో టీమిండియా తరుపున ఆరంగేట్రం చేసిన మురళీ విజయ్, 2018లో అదే ఆస్ట్రేలియాపై చివరి టెస్టు ఆడాడు. 2010లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో వన్డే కెరిర్‌ ప్రారంభించి 2015 చవరి వన్డే ఆడాడు. టీ20లో ఆఫ్గానిస్తాన్‌పై మొదటి మ్యాచ్‌ ఆడగా.. జింబాంబేపై చివరి మ్యాచ్‌ ఆడాడు. ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు. మురళీ విజయ్‌ తన కెరిర్‌లో 61 టెస్టు మ్యాచ్‌లో ఆడాడు. ఇందులో 12 సెంచరీలు, 15 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. 17 వన్డేలు ఆడిన మురళీ విజయ్ ఒక హాఫ్ సెంచరీ చేశాడు. అతను టెస్ట్, వన్డేల్లో కలిపి మొత్తం 2 వికెట్ల పడగొట్టాడు. టెస్ట్‌ల్లో 3,982 పరుగులు చేయగా, వన్డేల్లో 339 పరుగులు చేశాడు. విజయ్ ఐపీఎల్‌లో 2009 నుంచి 2013 వరకు చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున ఆడాడు. 2014లో ఢిల్లీకి, 2015 నుంచి 2017 వరకు పంజాబ్‌ కింగ్స్‌ నేతృత్వం వహించాడు. 2018 నుంచి 2020 వరకు మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున ఆడాడు. కాగా మురళీ విజయ్‌ దినేష్‌ కార్తిక్‌ మాజీ భార్య నికితను పెళ్లి చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి