AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya- Jyothika: పదో తరగతి ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన సూర్య గారాలపట్టి.. ఎన్ని మార్కులొచ్చాయో తెలుసా?

కోలీవుడ్‌లో ది మోస్ట్‌ రొమాంటిక్‌ కపుల్స్‌ జాబితాలో సూర్య- జ్యోతిక (Suriya- Jyothika) ల జోడి కూడా ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ రిలేషన్‌షిప్ పాఠాలు నేర్పుతోంది. 2006లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన..

Suriya- Jyothika: పదో తరగతి ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన సూర్య గారాలపట్టి.. ఎన్ని మార్కులొచ్చాయో తెలుసా?
Suriya Jyothika
Basha Shek
|

Updated on: Jun 24, 2022 | 12:58 PM

Share

Suriya- Jyothika: కోలీవుడ్‌లో ది మోస్ట్‌ రొమాంటిక్‌ కపుల్స్‌ జాబితాలో సూర్య- జ్యోతిక (Suriya- Jyothika) ల జోడి కూడా ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ రిలేషన్‌షిప్ పాఠాలు నేర్పుతోంది. 2006లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ క్యూట్‌కపుల్‌కు ఇద్దరు పిల్లులు ఉన్నారు. కూతురు పేరు దియా కాగా.. కొడుకు పేరు దేవ్. సూర్య సినిమాల్లో తన స్టార్‌డమ్‌ను కొనసాగిస్తుండగా జ్యోతిక నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటోంది. అయితే వ్యక్తిగతంగా వీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమ పిల్లల కోసం తగిన సమయం కేటాయిస్తున్నారు క్యూట్‌ కపుల్‌. ఇదిలా ఉంటే తన కూతురు దియా చదువులో టాపర్‌ అని, క్లాస్‌ ఫస్ట్‌ వస్తుందని సూర్య దంపతులు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాజాగా ఇది మరోసారి నిరూపితమైంది. ఇటీవల విడుదలైన తమిళనాడు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో దియా టాపర్‌గా నిలిచింది. అన్ని సబ్జెక్టుల్లోనూ తొంభైకి పైగా మార్కులు సాధించింది. ముఖ్యంగా చాలామంది కష్టంగా భావించే గణితంలో ఆమె వందకు వంద మార్కులు రావడం విశేషం.

లెక్కల్లో వందకు వంద..

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా ఎంతో కష్టమైన సబ్జెక్ట్‌ గణితంలో ఆమె వందకు వందశాతం మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక తమిళం, సోషల్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో 95 మార్కులు, సైన్స్‌లో-98, ఇంగ్లిష్‌లో-99, మ్యాథ్స్‌లో-100 మార్కులు తెచ్చుకుంది దియా. ఈక్రమంలో తమ గారాల పట్టి సాధించిన ఘనతను చూసి సూర్య- జ్యోతికలు మురిసిపోతున్నారు. ఇదిలా ఉంటే దియా పదో తరగతి మార్కుల జాబితా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు సూర్య దంపతులు, దియాకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రాధాష్టమి ఎప్పుడు? రాధకు శ్రీదాముడు ఇచ్చిన శాపం ఏమిటి? 100 ఏళ్ల..
రాధాష్టమి ఎప్పుడు? రాధకు శ్రీదాముడు ఇచ్చిన శాపం ఏమిటి? 100 ఏళ్ల..
ఇలాంటోడు ప్రపంచ క్రికెట్ హిస్టరీలోనే వెరీ రేర్ పీస్ భయ్యా..!
ఇలాంటోడు ప్రపంచ క్రికెట్ హిస్టరీలోనే వెరీ రేర్ పీస్ భయ్యా..!
ప్రతి మహిళ పాటించాల్సిన 20 ముఖ్యమైన అలవాట్లు..ఆరోగ్యకరమైన, సంతోషం
ప్రతి మహిళ పాటించాల్సిన 20 ముఖ్యమైన అలవాట్లు..ఆరోగ్యకరమైన, సంతోషం
రాత్రికి రాత్రే 23 కి.మీ మాయమైన సముద్రం.. ప్రమాదానికి సంకేతం
రాత్రికి రాత్రే 23 కి.మీ మాయమైన సముద్రం.. ప్రమాదానికి సంకేతం
ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే టెన్షన్​ లేకుండా 70 గంటల మ్యూజిక్​
ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే టెన్షన్​ లేకుండా 70 గంటల మ్యూజిక్​
అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్.. ఆఫ్ఘాన్ టార్గెట్ 222
అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్.. ఆఫ్ఘాన్ టార్గెట్ 222
Video: మైదానంలో అభిషేక్ శర్మ సరికొత్త సెలబ్రేషన్స్ చూశారా..?
Video: మైదానంలో అభిషేక్ శర్మ సరికొత్త సెలబ్రేషన్స్ చూశారా..?
చాతుర్మాసం తర్వాత పెళ్లి ముహూర్తాలు ఇవే.. నవంబర్, డిసెంబర్‌లో..
చాతుర్మాసం తర్వాత పెళ్లి ముహూర్తాలు ఇవే.. నవంబర్, డిసెంబర్‌లో..
దుమ్మురేపే ఫీచర్లతో రెడ్‌మీ నోట్​17
దుమ్మురేపే ఫీచర్లతో రెడ్‌మీ నోట్​17
ఐఫోన్ ధరకు, అతి తక్కువ ఖర్చుతో చుట్టిరాగల 5 అందమైన దేశాలు ఇవే..
ఐఫోన్ ధరకు, అతి తక్కువ ఖర్చుతో చుట్టిరాగల 5 అందమైన దేశాలు ఇవే..