VC Sajjanar: బిగ్‌ బీ అమితాబ్‌కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ రిక్వెస్ట్‌.. దయ చేసి అలాంటి పనులు చేయద్దంటూ..

సినిమా ఇండస్ట్రీలో టాప్ స్టార్స్‌గా వెలుగొందుతోన్న హీరోలు, హీరోయిన్లు యాడ్‌ ప్రమోషన్స్‌ చేయడం కొత్తేమీ కాదు. వీరు సినిమాలతో పాటు పలు కంపెనీల ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అలా యాడ్ ప్రమోషన్స్‌ ద్వారా కోట్ల ఆదాయం..

VC Sajjanar: బిగ్‌ బీ అమితాబ్‌కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ రిక్వెస్ట్‌.. దయ చేసి అలాంటి పనులు చేయద్దంటూ..
Amitabh Bachchan, Sajjanar
Follow us
Basha Shek

|

Updated on: Mar 31, 2023 | 12:07 PM

సినిమా ఇండస్ట్రీలో టాప్ స్టార్స్‌గా వెలుగొందుతోన్న హీరోలు, హీరోయిన్లు యాడ్‌ ప్రమోషన్స్‌ చేయడం కొత్తేమీ కాదు. వీరు సినిమాలతో పాటు పలు కంపెనీల ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అలా యాడ్ ప్రమోషన్స్‌ ద్వారా కోట్ల ఆదాయం ఆర్జిస్తున్న నటుట్లో బాలీవుడ్‌ సినీ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఒకరు. బిగ్‌ బీకి ఉన్న క్రేజ్‌, పాపులారిటీ దృష్ట్యా ఆయన ప్రమోట్‌ చేశారంటే ఆ ప్రొడక్ట్స్‌ ఇట్టే జనాల్లోకి దూసుకుపోతాయి. అందుకే పలు కంపెనీలు, సంస్థలు కోట్లలో డబ్బులు ఇచ్చి బిగ్‌ బీని తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంటున్నారు. అయితే బిగ్‌ బీ ప్రమోట్‌ చేసే కంపెనీల్లో కొన్ని జనాలను మోసం చేస్తున్నాయని, దయచేసి అలాంటి వాటికి ప్రచారం చేయద్దంటున్నారు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌. అమితాబ్‌ మల్టీ లెవల్ మార్కెటింగ్ ప్రమోటింగ్ కంపెనీ ఆమ్వేకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే గొలుసు కట్ట వ్యాపారం పేరుతో ఈ కంపెనీ జనాలను మోసం చేసిందని పలు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి 2022లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కేసు నమోదు చేసింది. ఆమ్వే ఆస్త్ఉలను కూడా జప్తు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

ప్రజలు నష్టపోతున్నారు..

ఈక్రమంలో ఆమ్వేకు అమితాబ్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగడాన్ని వీసీ సజ్జనార్‌ తప్పుపట్టారు. ‘అమితాబ్‌తో పాటు మిగిలిన స్టార్‌ హీరోలందరికి నాదొక విన్నపం. మోసం చేసే కంపెనీలకు ప్రచారం చేయకండి. మీ స్టార్ డమ్‌ను మంచి కోసం వాడండి. మీ పేరు, ప్రతిష్టలను సమాజానికి చెడు చేసే కంపెనీలపై వెచ్చించొద్దు. ఆమ్వే లాంటి కంపెనీలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయి. ఇలాంటి కంపెనీలకు ప్రచారం చేయడం వల్ల ప్రజలు, వ్యవస్థ మరింత నష్టపోయే ప్రమాదం ఉంది’ అని ట్విట్టర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు సజ్జనార్‌.

ఇవి కూడా చదవండి

గతంలో సానియాకు కూడా..

కాగా సజ్జనార్‌ హైదరాబాద్‌ సీపీగా ఉన్న సమయంలో జనాలను మోసం చేస్తోన్న పలు మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ కంపెనీలపై ఉక్కుపాదం మోపారు. సంస్థల ఆస్తులను జప్తు చేశారు. అందుకే ఈ గొలుసుకట్టు కంపెనీ మోసాలపై నిత్యం ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. గతంలో ఓ మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ సంస్థకు ప్రముఖటెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రచారం చేయడాన్ని కూడా సజ్జనార్‌ తప్పుపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..