Ramineni Awards: నేడు రామినేని పురస్కారాల బహూకరణ.. గెస్ట్‌గా జస్టిస్ ఎన్వీ రమణ.. ఎక్కడంటే..?
Ramineni Awards: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ చేతుల మీదుగా రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో 22 వ వార్షికోత్సవ
Ramineni Awards: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ చేతుల మీదుగా రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో 22 వ వార్షికోత్సవ పురస్కారాలను అందజేయనున్నారు. ఈ రోజు హైదరాబాద్ లోని అన్వయ కన్వెన్షన్ సెంటర్ లో కార్యక్రమం జరుగనుంది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి 1999 నుంచి పురస్కారాలు అందిస్తున్నట్టు డాక్టర్ రామినేని ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మప్రచారక్ చెప్పారు.
2021 సంవత్సరానికి గాను భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎం.ఎల్ల, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎం.ఎల్ల, తెలుగు సినీ హాస్య నటుడు బ్రహ్మానందం, నిమ్స్ ఆస్పత్రి ఎనస్థీషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ దుర్గాపద్మజ, తెలుగు సినిమా జర్నలిస్ట్ ఎస్‌వీ రామారావులు పురస్కారాలు అందుకుంటారు.
అయితే ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ.. గతేడాది ఫౌండేషన్ తరఫున పురస్కారాలను ప్రకటించినా కరోనా కారణంగా వాటిని అందజేయలేదన్నారు. ఇదే వేదికపై వారికి కూడా అందిస్తామని తెలిపారు. 2020 సంవత్సరానికి గాను నాబార్డ్ చైర్మన్ డాక్టర్ జీఆర్. చింతల, నటుడు సోనూ సూద్, యాంకర్ సుమ కనకాల, ప్రముఖ వైద్యులు డాక్టర్ బి. మస్తాన్ యాదవ్, షిర్డికి చెందిన ద్వారకామాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు బండ్లమూడి శ్రీనివాసులు పురస్కారాలు అందుకుంటారు.