ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉంటేనే జీతం.. లేదంటే అంతే సంగతులు..
Punjab Govt: పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సిన్ సర్టిఫికెట్ సబ్‌మిట్ చేస్తేనే జీతం అందుతుందని ప్రకటించింది.
Punjab Govt: పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సిన్ సర్టిఫికెట్ సబ్‌మిట్ చేస్తేనే జీతం అందుతుందని ప్రకటించింది. దీంతో ఉద్యోగులందరు అయోమయంలో పడ్డారు. ఒకరు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. మరొకరు ఒకే డోస్ వేసుకోవచ్చు కానీ జీతం కావాలంటే పంజాబ్ ప్రభుత్వ జాబ్ పోర్టల్‌లో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌లను కచ్చితంగా అప్‌లోడ్ చేయాలి. అయితే టీకాలు వేసుకోని ఉద్యోగుల విషయంలో ఏం చేయాలనుకుంటున్నారో ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.
ప్రజలందరు పూర్తిగా టీకాలు వేసుకోవడానికి పంజాబ్ ప్రభుత్వం ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే మరోవైపు కరోనావైరస్ వేరియంట్ ఓమిక్రాన్‌పై పెద్ద ఆందోళనలు ఉన్నాయి. టీకా సర్టిఫికేట్‌లను పంజాబ్ ప్రభుత్వ iHRMS వెబ్‌సైట్‌లో (Integrated Human Resource Management System) అప్‌లోడ్ చేయల్సి ఉంటుంది. ఇది జీతం చెల్లింపు, ఉద్యోగ విరమణ ప్రయోజనాల ఉపసంహరణలను క్రమబద్ధీకరిస్తుంది.
ఇదిలా ఉంటే.. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేయించుకోని వ్యక్తులు బహిరంగ ప్రదేశాలలో తిరగడాన్ని నిషేధించింది. రెండు డోసుల టీకాలు వేసుకున్న వ్యక్తులు మాత్రమే రాష్ట్రంలోని బహిరంగ ప్రదేశాలైన మాల్స్, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాలను సందర్శించడానికి అనుమతి ఉంటుంది. ఈ కొత్త నిబంధన జనవరి 1, 2022 నుంచి అమలులోకి వస్తుంది. Omicron వేరియంట్ భారతదేశంలోని 12 రాష్ట్రాల్లో కనుగొన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం భారతదేశంలో మొత్తం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 200 దాటింది.