Omicron: బూస్టర్ డోస్‌కు పెరుగుతున్న డిమాండ్.. WHO ఏం చెబుతుందంటే..?

Omicron: కరోనా వైరస్ కొత్త వేరియంట్ Omicron రోజు రోజుకు వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రపంచంలోని అనేక దేశాలు రక్షణ కోసం బూస్టర్ డోస్‌లను

Omicron: బూస్టర్ డోస్‌కు పెరుగుతున్న డిమాండ్.. WHO ఏం చెబుతుందంటే..?
Who Chief
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Dec 23, 2021 | 6:59 AM

Omicron: కరోనా వైరస్ కొత్త వేరియంట్ Omicron రోజు రోజుకు వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రపంచంలోని అనేక దేశాలు రక్షణ కోసం బూస్టర్ డోస్‌లను ప్రిఫర్ చేస్తున్నాయి. ఇజ్రాయెల్‌లో ఇప్పటికే నాలుగో డోస్‌ నడుస్తోంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ బూస్టర్ డోస్‌ల ద్వారా విపత్తు నుంచి బయటపడలేరని హెచ్చరిస్తోంది. ఏ దేశం కూడా మహమ్మారి నుంచి బయటపడలేదని వివరించే ప్రయత్నం చేసింది. ఇప్పటికే ఓమిక్రాన్‌ ప్రపంచంలోని 106 దేశాల్లో విస్తరించింది.

అయితే కొన్ని సంపన్న దేశాలకు అదనపు కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను పంపడం సమంజసం కాదని WHO వాదిస్తోంది. ఇది అసమానతలను మరింత తీవ్రతరం చేస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోని చాలా పేద దేశాల్లో చాలా మంది బలహీన ప్రజలు ఇప్పటి వరకు ఒక్క డోస్‌ టీకాని కూడా పొందలేదు. అయితే సంపన్న దేశాలు మాత్రం పెద్ద ఎత్తున బూస్టర్ డోస్‌లంటూ హడావిడి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

WHO డైరెక్టర్ జనరల్ డ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ.. “బూస్టర్ ప్రోగ్రామ్‌లు COVID-19 మహమ్మారిని అంతం చేయడంతో పాటు, ఇప్పటికే అధిక స్థాయిలో టీకాలు వేసిన దేశాలకు వ్యాక్సిన్ సరఫరాలను మళ్లిస్తాయి.” దీని కారణంగా వైరస్ వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంది.” ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు ఏ దేశం కూడా దారి చూపలేదన్నారు. కొత్త వేరియంట్ వేగంతో వ్యాప్తి చెందుతోందని ఇప్పటివరకు 106 దేశాల్లో దీనిని గుర్తించామని ఆయన పేర్కొన్నారు.

క్రిస్మస్ సెలవుల సందర్భంగా కోవిడ్ వ్యాప్తి చెందకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా కనీసం 126 దేశాలు ఇప్పటికే బూస్టర్ లేదా అదనపు వ్యాక్సిన్ మోతాదుల కోసం సిఫార్సులను జారీ చేశాయని, 120 దేశాలు ఈ కార్యక్రమాలను అమలు చేయడం ప్రారంభించాయని WHO స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (SAGE) తెలిపింది.

ఉద్యోగులకు షాకింగ్‌ న్యూస్‌.. వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే జీతం.. లేదంటే అంతే సంగతులు..

సంచలన నిర్ణయం.. జనవరి 1 నుంచి వ్యాక్సిన్‌ వేసుకోని వ్యక్తులు అక్కడ తిరగడం నిషేధం..

PM Kisan: రైతులకు శుభవార్త.. కొత్త సంవత్సరం రోజున పీఎం కిసాన్ పదో విడత డబ్బులు..

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..