AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు శుభవార్త.. కొత్త సంవత్సరం రోజున పీఎం కిసాన్ పదో విడత డబ్బులు..

PM Kisan: రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పదో విడత తేదీ ప్రకటించారు. లబ్ధిదారుల సెల్‌ఫోన్స్‌కి మెస్సేజ్ కూడా పంపారు. జనవరి 1న

PM Kisan: రైతులకు శుభవార్త.. కొత్త సంవత్సరం రోజున పీఎం కిసాన్ పదో విడత డబ్బులు..
uppula Raju
|

Updated on: Dec 22, 2021 | 10:53 PM

Share

PM Kisan: రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పదో విడత తేదీ ప్రకటించారు. లబ్ధిదారుల సెల్‌ఫోన్స్‌కి మెస్సేజ్ కూడా పంపారు. జనవరి 1న ప్రధాని మోదీ రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతారు. రైతులకు పంపిన మెస్సేజ్‌ ప్రకారం.. కొత్త సంవత్సరం మొదటి రోజు అంటే జనవరి 1, 2022, 12 గంటలకు PM కిసాన్ యోజన కింద 10వ విడత డబ్బులను ప్రధాని మోడీ విడుదల చేస్తారు. రైతు ఉత్పత్తి సంస్థలకు ఈక్విటీ గ్రాంట్లను కూడా విడుదల చేస్తారని మెస్సేజ్‌ ద్వారా తెలియజేశారు. రైతులు pmindiawebcast.nic.in లేదా దూరదర్శన్ ద్వారా ఈ కార్యక్రమంలో చేరవచ్చు. మీరు PM కిసాన్ పథకం కోసం నమోదు చేసుకున్నట్లయితే ఈ పథకం లబ్ధిదారుల జాబితాలో మీ పేరును తనిఖీ చేయవచ్చు. ఇక్కడ ఇచ్చిన ప్రక్రియను అనుసరించడం ద్వారా జాబితాలో మీ పేరును సులభంగా తెలుసుకోవచ్చు.

1. PM కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.inకి వెళ్లండి. 2. రైతుల కార్నర్ ఎంపికపై హోవర్ చేయండి. 3. ఫార్మర్స్ కార్నర్ విభాగంలో, లబ్ధిదారుల జాబితా ఎంపికపై క్లిక్ చేయండి. 4. ఇప్పుడు మీరు డ్రాప్ డౌన్ జాబితా నుంచి రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోండి. 5. ‘గెట్ రిపోర్ట్’పై క్లిక్ చేయండి. 6. లబ్ధిదారుల పూర్తి జాబితా మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అందులో మీ పేరును తనిఖీ చేయవచ్చు.

మీది ఎన్నో విడత కూడా తెలుసుకోవచ్చు.. 1. మీ ఇన్‌స్టాల్‌మెంట్ స్థితిని చూడటానికి మీరు ముందుగా PM కిసాన్ వెబ్‌సైట్‌కి వెళ్లండి. 2. కుడి వైపున ఉన్న ఫార్మర్స్ కార్నర్‌పై క్లిక్ చేయండి. 3. బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. 4. కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. 5. మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. 6. మీ స్థితి గురించి పూర్తి సమాచారం కనిపిస్తుంది.

Konidela Upasana: ప్రధానమంత్రితో సమావేశమైన మెగా కోడలు.. ఎందుకంటే..

Covid Restricts: ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభించడంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. బహిరంగ వేడుకలపై ఆంక్షలు

Snapdeal IPO: ఐపీఓకు దరఖాస్తు చేసిన స్నాప్‌డీల్.. రూ. 1,250 కోట్ల సేకరణే లక్ష్యం..