AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konidela Upasana: ప్రధానమంత్రితో సమావేశమైన మెగా కోడలు.. ఎందుకంటే..

ప్రధానమంత్రి నరేంద్రమోడీతో మెగా కోడలు, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ కొణిదెల ఉపాసన సమావేశమైంది.

Konidela Upasana: ప్రధానమంత్రితో సమావేశమైన మెగా కోడలు.. ఎందుకంటే..
Basha Shek
|

Updated on: Dec 22, 2021 | 10:33 PM

Share

ప్రధానమంత్రి నరేంద్రమోడీతో మెగా కోడలు, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ కొణిదెల ఉపాసన సమావేశమైంది. ఇండియన్‌ ఎక్స్‌పో- 2020లో భాగంగా ఈ సమావేశం జరిగింది. కాగా మోడీ సమావేశానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది ఉపాసన. ‘ఇండియన్ ఎక్స్‌పో- 2020లో భాగంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకున్నాను. ఆవిష్కరణ, ఆరోగ్య సంరక్షణ చర్యలను మరింత మెరుగుపర్చడం, మహిళా సాధికారత, సంస్కృతి పరిరక్షణ మీద దృష్టిసారించడం అనేవి అద్భుతమైన అంశాలు. అలాగే సాంకేతికత శక్తి మనకు ఎన్నో అవకాశాలను ఇస్తుంది ఇస్తుంది. మనం వాటిని తెలివిగా, సమర్థంగా ఉపయోగించుకోవాలి’ అని రాసుకొచ్చింది.

మెగా కోడలు, రామ్‌చరణ్‌ సతీమణి గానే కాకుండా పలు సేవా కార్యక్రమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక జంతువుల సంరక్షణ కోసం పాటు పడుతోన్న ఆమె ఇటీవల హైదరాబాద్‏లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‏లో ఉన్న విక్కీ, లక్ష్మీ అనే రెండు ఆసియా సింహాలను దత్తత తీసుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్‏గా ఉంటూ.. ఫిట్‏నెస్ గురించి.. ఆయుర్వేద వైద్యం, జంతువుల సంరక్షణ గురించి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ.. వీడియోలను షేర్ చేస్తుంటారు.

Also Read:

RRR: జక్కన్న బిగ్ ప్లాన్.. RRR తెలుగు ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌‌కు అతిథులుగా ఆ ఇద్దరు హీరోలు!

Kamal Haasan: విక్రమ్‌ సెట్‌లోకి అడుగుపెట్టిన కమల్‌.. సినిమా విడుదల ఎప్పుడంటే!

Nani : ఆ సినిమాలు నాకు సెట్ కావని అర్ధమైపోయింది.. అందుకే వాటి జోలికి వెళ్లడంలేదు.. నాని ఇంట్రస్టింగ్ కామెంట్స్..