AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani : ఆ సినిమాలు నాకు సెట్ కావని అర్ధమైపోయింది.. అందుకే వాటి జోలికి వెళ్లడంలేదు.. నాని ఇంట్రస్టింగ్ కామెంట్స్..

న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై నాని అభిమానులు చిత్రయూనిట్ భారీ ఆశలే పెట్టుకున్నారు.

Nani : ఆ సినిమాలు నాకు సెట్ కావని అర్ధమైపోయింది.. అందుకే వాటి జోలికి వెళ్లడంలేదు.. నాని ఇంట్రస్టింగ్ కామెంట్స్..
Nani
Rajeev Rayala
|

Updated on: Dec 22, 2021 | 9:01 PM

Share

Nani : న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై నాని అభిమానులు చిత్రయూనిట్ భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇక చిత్రబృందం ఈ సినిమా విజయం పై ధీమాగా ఉంది.  నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది.

తాజాగా నాని మాట్లాడుతూ.. ఈ సినిమాను ఆడియెన్స్ ఎప్పుడెప్పుడు చూస్తారా? అని ఎదురుచూస్తున్నాను. మిక్కీ జే మేయర్, సాను వర్గీజ్ పనితనం ఎంత గొప్పగా ఉంటుందో డిసెంబర్ 24న తెలుస్తుంది అన్నారు నాని. సాయి పల్లవి, కృతి శెట్టిలు అద్భుతంగా నటించారు. రాహుల్‌ని నేను ఇప్పుడు ఎంత పొగిడినా సొంత డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంటుంది. రాహుల్ సైడ్ నుంచి పెద్ద సర్ ప్రైజ్ ఉండబోతోంది అన్నారు నాని. తాజాగా నానికు రీమేక్ సినిమాలకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఎందుకని ఈ మధ్య రీమేక్ సినిమాలు చేయడం లేదని ప్రశ్నించగా.. నాని స్పందిస్తూ.. గతంలో తను చేసిన రెండు రీమేకులు తనకి పాఠం నేర్పడం వలన ఆ వైపు వెళ్లదలచుకోలేదని చెప్పాడు. రీమేకులు తనకి అంతగా సెట్ కావనే విషయం తనకి అర్థమైపోయిందని అన్నాడు నాని. తాను రీమేక్ సినిమాలు చేయడం కంటే, తన సినిమాలు రీమేక్ అవుతుండటం తనకి ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పుకొచ్చాడు ఈ నేచురల్ స్టార్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Dharmasthali: ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా రానున్న ‘ధ‌ర్మ‌స్థ‌లి’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్

S. Thaman: నాన్న చనిపోయినప్పుడు వచ్చిన డబ్బులే నా జీవితాన్ని మార్చేశాయి.. ఎమోషనల్ అయిన తమన్..

NTR: బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్న జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఏ క్షణమైనా..

Follow Us
10 రోజుల్లో మీ శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసుకోవాలంటే.. ఈ జ్యూస్ తో
10 రోజుల్లో మీ శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసుకోవాలంటే.. ఈ జ్యూస్ తో
వాహనాల దొంగలకు చెక్‌.. ఫొటో తీస్తే చోరీ బండి పట్టుబడినట్టే!
వాహనాల దొంగలకు చెక్‌.. ఫొటో తీస్తే చోరీ బండి పట్టుబడినట్టే!
రమానందన దంపతులకు బిగుస్తున్న ఉచ్చు..!
రమానందన దంపతులకు బిగుస్తున్న ఉచ్చు..!
మరణ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి..
మరణ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి..
బీరకాయ తొక్కను పారేయకండి! ఇలా పచ్చడి చేసి తిన్నారంటే ఆరోగ్యానికి
బీరకాయ తొక్కను పారేయకండి! ఇలా పచ్చడి చేసి తిన్నారంటే ఆరోగ్యానికి
వరంగల్ ఎయిర్ పోర్ట్‌కి ఏ పేరు బాగుంటుంది?
వరంగల్ ఎయిర్ పోర్ట్‌కి ఏ పేరు బాగుంటుంది?
చీకట్లోనూ రంగుల వీడియో! రూ.5,100కే Xiaomi కొత్త స్మార్ట్ కెమెరా
చీకట్లోనూ రంగుల వీడియో! రూ.5,100కే Xiaomi కొత్త స్మార్ట్ కెమెరా
దీర్ఘకాలిక మైగ్రేన్ నివారణకు అద్భుతమైన మూలికా పానీయం..తాగితే మాయం
దీర్ఘకాలిక మైగ్రేన్ నివారణకు అద్భుతమైన మూలికా పానీయం..తాగితే మాయం
వార్మప్‌ మ్యాచ్‌లో ప్రమాదం.. పిచ్ రోలర్ కింద పడిన దిగ్గజ ప్లేయర్
వార్మప్‌ మ్యాచ్‌లో ప్రమాదం.. పిచ్ రోలర్ కింద పడిన దిగ్గజ ప్లేయర్
ఖాళీ కడుపుతో టీ, కాఫీలకు బై-బై చెప్పి మునగాకు-ఉసిరి జ్యూస్ తాగితే
ఖాళీ కడుపుతో టీ, కాఫీలకు బై-బై చెప్పి మునగాకు-ఉసిరి జ్యూస్ తాగితే