AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

S. Thaman: నాన్న చనిపోయినప్పుడు వచ్చిన డబ్బులే నా జీవితాన్ని మార్చేశాయి.. ఎమోషనల్ అయిన తమన్..

ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తన మ్యూజిక్ తో సినిమాలకు ప్రాణం పోస్తున్నాడు ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్..

S. Thaman: నాన్న చనిపోయినప్పుడు వచ్చిన డబ్బులే నా జీవితాన్ని మార్చేశాయి.. ఎమోషనల్ అయిన తమన్..
Thaman
Rajeev Rayala
|

Updated on: Dec 22, 2021 | 5:25 PM

Share

S. Thaman: ప్రస్తుతం టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తన మ్యూజిక్‌తో సినిమాలకు ప్రాణం పోస్తున్నాడు ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు తమన్.  తక్కువ సమయంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు ఎస్.ఎస్ తమన్. నిన్న మొన్నటి వరకు మీడియా రేంజ్ హీరోల సినిమాలు చేస్తూ వచ్చిన తమన్ ఇప్పుడు బడా హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా మారారు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అరవింద సామెత సినిమా నుంచి తమన్ మ్యూజిక్ లో చాలా మార్పులు వచ్చాయి. ఆ తర్వాత అల వైకుంఠపురంలో సినిమా మ్యూజిక్ ఆల్ టైం సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక ఇటీవల వచ్చిన అఖండ సినిమా మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌కు సౌండ్ బాక్స్‌లు పగిలిపోతున్నాయి అని థియేటర్ ఓనర్లు మొత్తుకుంటున్నారు. ఇదిలా ఉంటే తమన్ ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్‌లో ప్రసారం అవుతున్న టాక్ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాకు డ్రమ్స్ వాయించడం పై ఆసక్తి మా నాన్న గారి దగ్గర నుంచి కలిగింది. అయన చాలా బాగా డ్రమ్స్ వాయించేవారు. మా తాతయ్య గారి ఇంటికి వెళ్లి వస్తుండగా ట్రైన్‌లో మా నాన్న గారికి గుండెపోటు వచ్చింది.. చికిత్స ఆలస్యం కావడంతో ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన ఎల్ఐసి పాలసీ 60 వేల రూపాయలతో మా అమ్మ నాకు డ్రమ్స్ కొనించింది. వాటితోనే సాధన చేసేవాడిని అని ఎమోషనల్ అయ్యాడు తమన్. నేను మొదటి సారి డ్రమ్మర్ గా పనిచేసిన సినిమా భైరవద్వీపం.. ఈ సినిమాకు నాకు 30 రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చారు అంటూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు తమన్. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు తమన్.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా చేస్తున్నాడు. అలాగే మహేష్ బాబు నటిస్తున్న సర్కారువారి పాట, రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, రాంచరణ్ శంకర్ సినిమా, వరుణ్ తేజ్ గని, మహేష్ త్రివిక్రమ్ సినిమా, మెగాస్టార్ గాడ్ ఫాదర్ ఇలా మరికొన్ని సినిమాలు కూడా తమన్ లిస్ట్ లో ఉన్నాయ్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Naga Chaitanya: నాగచైతన్య వెబ్ సిరీస్ ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. చైతూ అలా కనిపించనున్నాడట..

Vijayawada: ఏపీలో కొనసాగుతున్న థియేటర్ల తనిఖీలు.. కృష్ణా జిల్లాలో 15 థియేటర్లు సీజ్‌..

Tollywood Rewind 2021: ఈ సంవత్సరం టాలీవుడ్‌ ఇండస్ట్రీని బతికించింది ఆ ముగ్గురే..