AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR: బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్న జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఏ క్షణమైనా..

NTR Bollywood: ప్రస్తుతం సినిమాకు భాషకు మధ్య ఉన్న బంధం క్రమంగా తగ్గుతూ వస్తోంది. పాన్‌ ఇండియా సినిమా ట్రెండ్ మొదలైనప్పటి నుంచి భాషతో సంబంధం లేకుండా సినిమా అన్ని భాషల ప్రేక్షకులను...

NTR: బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్న జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఏ క్షణమైనా..
Narender Vaitla
|

Updated on: Dec 22, 2021 | 5:05 PM

Share

NTR Bollywood: ప్రస్తుతం సినిమాకు భాషకు మధ్య ఉన్న బంధం క్రమంగా తగ్గుతూ వస్తోంది. పాన్‌ ఇండియా సినిమా ట్రెండ్ మొదలైనప్పటి నుంచి భాషతో సంబంధం లేకుండా సినిమా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కంటెంట్‌ ఉండాలే కానీ భాషతో సంబంధం లేదన్నట్లూ దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే హీరోలు కూడా ఇతర భాషల్లో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో స్ట్రెయిట్‌ ఫిలిమ్స్‌ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్‌ ఆదిపురుష్‌తో బాలీవుడ్‌ బాట పట్టాడు. ఇక తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా అదే బాటలో నడవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా జూనియర్‌ చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూర్చాయి.

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమాతో తొలిసారి బాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు. నిజానికి తారక్‌ నటించిన కొన్ని తెలుగు సినిమాలు ఇప్పటికే డబ్‌ అయ్యి యూట్యూబ్‌లో బీటౌన్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే టెక్నికల్‌గా జూనియర్‌ తొలి బాలీవుడ్‌ మూవీ మాత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ అని చెప్పాలి. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతోన్న ఎన్టీఆర్‌ ఇటీవల బాలీవుడ్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా నేరుగా హిందీ సినిమాలో ఎప్పుడు నటిస్తారని ఓ రిపోర్టర్‌ ప్రశ్నించగా దానికి స్పందించిన ఎన్టీఆర్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా జూనియర్‌ మాట్లాడుతూ.. ‘నేను కూడా బాలీవుడ్‌ సినిమా అవకాశాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విడుదలైన తర్వాత పరిస్థితులు మారి అవకాశాలు రావొచ్చని ఆశిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు. దీంతో ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ ఎంట్రీపై తనకున్న ఇష్టాన్ని బాహాటంగానే చెప్పేశాడన్నమాట. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయనున్న విషయం తెలిసిందే.

Also Read: HMDA Kokapet Lands: కోకాపేట భూముల అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. త్వరలో ఈ వేలం ద్వారా విక్రయం!

Bank Of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. డిగ్రీ, ఎంబీఏ చేసిన వారు అర్హులు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ..

Chanakya Niti: ఈ 4 విషయాలను అర్థం చేసుకున్న వారికి కష్టాలు ఎప్పటికీ రావట..!