Chanakya Niti: ఈ 4 విషయాలను అర్థం చేసుకున్న వారికి కష్టాలు ఎప్పటికీ రావట..!

Chanakya Niti: వందల ఏళ్లు గడిచినా ఆచార్య చాణక్యుడి ఖ్యాతి మాత్రం ఏమాత్రం తగ్గదు. వర్తమానానికే కాకుండా.. భవిష్యత్ తరాల వారికి కూడా చాణక్యుడు..

Chanakya Niti: ఈ 4 విషయాలను అర్థం చేసుకున్న వారికి కష్టాలు ఎప్పటికీ రావట..!
Chanakya
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 22, 2021 | 2:21 PM

Chanakya Niti: వందల ఏళ్లు గడిచినా ఆచార్య చాణక్యుడి ఖ్యాతి మాత్రం ఏమాత్రం తగ్గదు. వర్తమానానికే కాకుండా.. భవిష్యత్ తరాల వారికి కూడా చాణక్యుడు ఎంతో స్ఫూర్తి దాయకంగా నిలుస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన మేధస్సు, ముందుచూపు, చాణక్యం, చతురత ఆయనను అపర చాణక్యుడిగా చరిత్రలో నిబటెట్టింది. అయితే, చాలా మంది అజాగ్రత్త కారణంగా అనుకోని కష్టాలను కొని తెచ్చుకుంటారు. అటువంటి వారి కోసం ఆచార్య చాణక్యుడు అద్భుతమైన సలహాలు, సూచనలు చేశారు. ఏ పరిస్థితినైనా దూరం నుంచి పసిగట్టగల సామర్థ్యం ప్రజలను ఇబ్బందుల నుంచి దూరం చేస్తుందని చాణక్యుడు చెబుతారు. ముఖ్యంగా నాలుగు అంశాలను అర్థం చేసుకుంటే ఎలాంటి సమస్య అయినా వారి దరిచేరదని చెబుతున్నారు. మరి ఆ నాలుగు అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సరైన దృష్టి పెట్టాలి.. ఏ వ్యక్తి అయినా నడిచే సమయంలో చూసుకుని నడవాలి అంటారు. డ్రైవింగ్ చేసేవారైనా సరే జాగ్రత్తగా చూసుకుంటూ డ్రైవింగ్ చేయాలంటారు. లేదంటే అనుకోని ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది.

ఆరోగ్యంపై దృష్టి.. మీరు జీవితంలో విజయం సాధించాలనుకుంటే ముందుగా మీ శరీరాన్ని ఆరోగ్యంగా మార్చుకోవాలి. తద్వారా మీరు కష్టపడి పని చేయగలుగుతారు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, పరిశుద్ధమైన నీటిని తాగాలి. తద్వారా ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవవు.

ముందు చూపు.. ఏదైనా పనిని ప్రారంభించే ముందు దాని గురించి అన్ని విధాలుగా ఆలోచించాలి. అర్థం చేసుకోవాలి. దానికి సంబంధించి పూర్తి నిర్ధారణకు వచ్చాక సరైన నిర్ణయం తీసుకోవాలి. ఆ తరువాత ఆ పనిని ప్రారంభించాలి. అయితే, ఏదైనా పని మొదలు పెడితే పూర్తి శ్రమతో, అంకితభావంతో చేయాలి. ఒక పనిని మొదలు పెట్టిన తరువాత మీ మనస్సులో ఎలాంటి సందేహాన్ని రానివ్వకండి.

అబద్ధాలకు దూరంగా ఉండాలి.. అబద్ధాలు చెప్పే వ్యక్తి కొన్నిసార్లు తన మాటలకే బలైపోతాడు. ఎందుకంటే ఇలా అబద్ధాలు చెప్పేవారు ఒక అబద్ధాన్ని దాచడానికి చాలా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అందుకే అబద్ధాలకు దూరంగా ఉండటం మంచిది. సత్య మార్గాన్ని ఎన్నుకోండి. సత్యాన్ని అనుసరించడం కష్టం కావచ్చు, కానీ అది మీ కీర్తిని పెంచుతుంది.

Also read:

IT Rides – Actor Vijay: తమిళ నటుడు విజయ్ బంధువు ఇంటిపై ఐటీ అధికారుల దాడులు.. కొనసాగుతున్న సోదాలు..

Telangana – Harish Rao: తెలంగాణ మంత్రులనే అవమానిస్తారా?.. కేంద్రమంత్రి దుమ్ము దులిపిన హరీష్ రావు..

Gujarat panchayat polls: ఇంట్లో 12 ఓట్లు ఉంటే ఒక్కటి కూడా పడకపాయే.. విషయం తెలిసిన అభ్యర్థి ఏం చేశాడంటే..!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?