AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IT Rides – Actor Vijay: తమిళ నటుడు విజయ్ బంధువు ఇంటిపై ఐటీ అధికారుల దాడులు.. కొనసాగుతున్న సోదాలు..

IT Rides - Actor Vijay: తమిళ నటుడు విజయ్ బంధువు, మాస్టర్ సినిమా నిర్మాత బ్రిట్టో ఇల్లు, ఆఫీసులలో ఐటీ శాఖ దాడులు చేసింది.

IT Rides - Actor Vijay: తమిళ నటుడు విజయ్ బంధువు ఇంటిపై ఐటీ అధికారుల దాడులు.. కొనసాగుతున్న సోదాలు..
y
Shiva Prajapati
|

Updated on: Dec 22, 2021 | 1:33 PM

Share

IT Rides – Actor Vijay: తమిళ నటుడు విజయ్ బంధువు, మాస్టర్ సినిమా నిర్మాత బ్రిట్టో ఇల్లు, ఆఫీసులలో ఐటీ శాఖ దాడులు చేసింది. ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, ఒరగడం ప్రాంతాల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. కోట్ల రూపాయలు పన్ను ఎగవేతకు సంబంధించి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, బుధవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న చైనా మొబైల్ కంపెనీల కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు సహా పలు నగరాల్లో ఉదయం 9 గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు మంగళవారం, నేపాల్ అనేక చైనా కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చినట్లు వార్తలు వచ్చాయి.

మొబైల్ కంపెనీ Oppo Group, Xiaomi లు పెద్ద ఎత్తున పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఈ చర్యలకు ఉపక్రమించింది. Oppo గ్రూప్‌తో సంబంధం ఉన్న పలువురు సీనియర్ అధికారులు, డైరెక్టర్లు, సీఎఫ్ఓ, ఇతర అధికారుల ఇల్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది.

అధికారిక సమాచారం ప్రకారం.. భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో 70 శాతం వాటా చైనా కంపెనీల ఉత్పత్తులదే. అదే సమయంలో, భారతదేశంలో టెలివిజన్ మార్కెట్ దాదాపు రూ.30,000 కోట్లు. ఇందులో చైనా కంపెనీల స్మార్ట్ టీవీల వాటా దాదాపు 45 శాతం. నాన్-స్మార్ట్ టీవీల వాటా దాదాపు 10 శాతం. కాగా, ప్రస్తుతంలో దేశంలో చైనాకు చెందిన 80 కీలక కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్‌కు తెలిపింది. భారత్‌లో 92 చైనీస్ కంపెనీలు రిజిస్టర్ అవ్వగా.. వాటిలో 80 కంపెనీలు యాక్టీవ్‌గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.

Also read:

Shocking Incident: మహిళతో పోలీసు అసభ్యకర ప్రవర్తన.. మూత్ర విసర్జన చేస్తూ ఏం చేశాడంటే..

Maoists Kill: మావోయిస్టుల మరో ఘాతుకం.. సూరవీడు మాజీ సర్పంచ్‌ కొర్సా రమేష్‌ దారుణ హత్య..

Telangana – Harish Rao: తెలంగాణ మంత్రులనే అవమానిస్తారా?.. కేంద్రమంత్రి దుమ్ము దులిపిన హరీష్ రావు..