Maoists Kill: మావోయిస్టుల మరో ఘాతుకం.. సూరవీడు మాజీ సర్పంచ్‌ కొర్సా రమేష్‌ దారుణ హత్య..

మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ములుగు జిల్లా వెంకటా పురం మండలంలోని సూరవీడు మాజీ సర్పంచ్‌ కొర్సా రమేశ్‌ను దారుణంగా హత్య చేశారు. తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో..

Maoists Kill: మావోయిస్టుల మరో ఘాతుకం.. సూరవీడు మాజీ సర్పంచ్‌ కొర్సా రమేష్‌ దారుణ హత్య..
Ramesh
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 22, 2021 | 1:24 PM

Maoists Kill: మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ములుగు జిల్లా వెంకటా పురం మండలంలోని సూరవీడు మాజీ సర్పంచ్‌ కొర్సా రమేష్‌ను దారుణంగా హత్య చేశారు. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఈ దారుణానికి పాల్పడ్డారు. అనంతరం ఓ లేఖను విడుదల చేశారు. ఇందులో పలు వివరాలను వెల్లడిచారు. పోలీసులకు రమేష్ ఇన్‌ఫార్మర్‌గా మారి హత్యకు కుట్ర చేశాడని పేర్కొన్నారు. వివరాల్లోకి వెలితే.. ములుగు జిల్లా వెంకటా పురం మండలంలోని సూరవీడు మాజీ సర్పంచ్‌ కొర్సా రమేష్‌ను రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. మావోయిస్టులు ఆయన్ను కిడ్నా్‌ప చేసి ఉంటారని కుటుంబసభ్యులు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.రమే ష్‌ కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో రమేష్‌ సోమవారం సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని బంధువుల ఇంటికి వెళ్లినట్లు తెలిసి అక్కడి వారిని సంప్రదించగా ఎలాంటి సమా చారం లభించలేదు. మావోయిస్టులే రమేష్‌ను కిడ్నాప్‌ చేసి ఉంటారని భార్య రజిత ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త అమాయకుడని, ఎవరికీ అపాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా తప్పుచేసినా, మీరు చెప్పిన పని చేయకపోయినా మన్నించి వదిలేయడని వేడుకుంది. ఆయనకు ఏమైనా అయితే నేను, ఇద్దరు చిన్నపిల్లలం ఆగమవుతామని మావోయిస్టులకు మొర పెట్టుకుంది. అయినా మావోయిస్టుల మనస్సు కరగలేదు.. కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. ఛత్తీస్‌గఢ్‌లోని కొత్తపల్లి వద్ద అత్యంత దారుణంగా హత్య చేశారు.

కొర్సా రమేష్‌ 2013 నుంచి 2018 వరకు సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తర్వాత స్థానికంగా కారు డ్రైవర్‌గా పని చేస్తు కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరి కుటుంబం కొన్నేళ్లుగా ఏటూరునాగారంలో నివాసముంటోంది. ఈ మధ్యే రమేష్ భార్య రజిత ఏటూరునాగారం మండలంలో వైద్య ఆరోగ్యశాఖలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Reservation: వారికి కూడా అవకాశం.. రిజర్వేషన్.. అంతేకాదు ఇక అక్కడ పోలీసులుగా..

Lok Sabha: సభలో మీ ఎంపీ ఏం చేస్తున్నారో చూడాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..

Honey for Skin: పట్టులాంటి చర్మం కోసం తేనెను ఉపయోగించండి.. ఎలా వాడాలో తెలుసుకోండి..