AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Incident: మహిళతో పోలీసు అసభ్యకర ప్రవర్తన.. మూత్ర విసర్జన చేస్తూ ఏం చేశాడంటే..

Shocking Incident: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. వీధిలో ఉన్న ఓ మహిళతో.. పోలీసు కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె తనవైపు

Shocking Incident: మహిళతో పోలీసు అసభ్యకర ప్రవర్తన.. మూత్ర విసర్జన చేస్తూ ఏం చేశాడంటే..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Dec 22, 2021 | 1:25 PM

Share

Shocking Incident: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. వీధిలో ఉన్న ఓ మహిళతో.. పోలీసు కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె తనవైపు చూసేలా తన ప్రైవేట్ పార్ట్స్‌ను ప్రదర్శిస్తూ అసహ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఆ పోలీస్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయడంతోపాటు కేసు నమోదు చేసినట్లు నగర పోలీసు అధికారి సీకే బాబా మంగళవారం వెల్లడించారు. ఈ మేరకు బెంగళూరు ఈశాన్య డివిజన్ డీసీపీ బాబా మాట్లాడుతూ.. అమృతహళ్లి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి చంద్రశేఖర్ ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో యలహంక న్యూ టౌన్ హౌసింగ్ బోర్డు సమీపంలోకి రాగానే అతను మూత్ర విసర్జన చేసేందుకు బైక్‌ను ఆపాడు. ఈ సమయంలో వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు ఇంటినుంచి బయటకు వచ్చిన ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను చూసిన కానిస్టేబుల్ తన ప్రైవేటు పార్ట్స్‌ను పదర్శిస్తూ.. అసహ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళ అతనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆ మహిళతో కానిస్టేబుల్ వాగ్వాదానికి దిగడంతో స్థానికులు అక్కడికి చేరుకుని వీడియోలు తీశారు.

దీనికి సంబంధించిన వీడియోను బెంగళూరు పోలీస్ కమీషనర్ సోషల్ మీడియా ఖాతాలో ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ అయిన అనంతరం పోలీసులు చర్యలు తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేయడంతోపాటు.. సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు యలహంక న్యూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

అర్ధరాత్రి ఉలిక్కిపడిన బిల్డింగ్ వాసులు.. ఏడో అంతస్తు నుంచి నగ్నంగా కిందపడిన యువతి.. ఆ తర్వాత..

Crime News: ఇంట్లోకి వెళ్లకుండానే చనిపోయాడు.. లిఫ్ట్‌లో చిక్కుకొని బాలుడి దుర్మరణం.. అసలేమైందంటే..?

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?