అర్ధరాత్రి ఉలిక్కిపడిన బిల్డింగ్ వాసులు.. ఏడో అంతస్తు నుంచి నగ్నంగా కిందపడిన యువతి.. ఆ తర్వాత..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Dec 22, 2021 | 8:33 AM

Greater Noida Crime News: స్నేహితుడిని కలిసేందుకు.. వేరే రాష్ట్రం నుంచి అక్కడికి వచ్చింది. ఏమైందో ఏమో కానీ.. ఆ యువతి అకస్మాత్తుగా 7వ అంతస్తు నుంచి నగ్నంగా కిందపడింది. తలకు తీవ్రగాయాలవ్వడంతో

అర్ధరాత్రి ఉలిక్కిపడిన బిల్డింగ్ వాసులు.. ఏడో అంతస్తు నుంచి నగ్నంగా కిందపడిన యువతి.. ఆ తర్వాత..
Crime News

Greater Noida Crime News: స్నేహితుడిని కలిసేందుకు.. వేరే రాష్ట్రం నుంచి అక్కడికి వచ్చింది. ఏమైందో ఏమో కానీ.. ఆ యువతి అకస్మాత్తుగా 7వ అంతస్తు నుంచి నగ్నంగా కిందపడింది. తలకు తీవ్రగాయాలవ్వడంతో ఆమె కోమాలోకి వెళ్లింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో చోటుచేసుకుంది. డిసెంబర్‌ 12 జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని పానిపట్‌లో నివసిస్తున్న 24 ఏళ్ల ఓ యువతి.. తన స్నేహితుడిని కలవడానికి నోయిడాలోని ఓ సొసైటీకి వచ్చింది. రాత్రివేళ పడుకున్న అనంతరం యువతి వాష్‌రూమ్‌ వెళ్లడానికి లేచింది. ఆ తరువాత ఏమైందో ఏమో గానీ అపార్ట్‌మెంట్‌లోని 7వ అంతస్తులోని రూమ్ కిటికీ నుంచి నగ్నంగా ఒక్కసారిగా కిందపడిపయింది. దీంతో తీవ్రగాయాలయ్యాయి. అరుపులు విని లేచిన అపార్ట్ వాసులు.. యువతిని రక్షించేందుకు అక్కడికి వెళ్లారు. అయితే.. ప్రమాదం సమయంలో యువతి నగ్నంగా ఉన్నట్లు గుర్తించి.. పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని ఆసుపత్రికి తరలించారు. కింద పడటంతో.. యువతి మెడ విరిగి కోమాలోకి వెళ్లిపోయిందని.. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా యువతి నిద్రమత్తులో అకస్మాత్తుగా కిటికీలోంచి కింద పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అయినప్పటికీ యువతి ప్రమాదవశాత్తు కిందపడిందా? లేక ఎవరైనా తోసేశారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. యువతి కోమాలోకి వెళ్లిపోవడంతో ఆమె నుంచి ఎలాంటి వివరాలు సేకరించలేదతపతాకగ. బాధితురాలు స్పృహలోకి రాగానే నిజానిజాలు తెలుస్తాయని పేర్కొన్నారు. యువతి స్నేహితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే యువతి తనను కలిసేందుకు తరుచూ అపార్ట్‌మెంట్‌కు వస్తూ ఉంటుందని ఆమె స్నేహితుడు పోలీసులకు వెల్లడించారు. ఘటన జరిగిన రోజు ఇద్దరు కలిసి పార్టీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

అయతే.. రాత్రి పడుకున్న అనంతరం మద్యం మత్తులో ఉన్న యువతి బాత్‌రూమ్‌‌కు వెళ్లినట్లు పోలీసులకు చెప్పాడు. ఈ ఘటన అనంతరం ఆ యువతి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చామని.. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ ఘటన ఢిల్లీ ఎన్సీఆర్‌లో కలకలం సృష్టించింది.

Also Read:

Crime News: ఇంట్లోకి వెళ్లకుండానే చనిపోయాడు.. లిఫ్ట్‌లో చిక్కుకొని బాలుడి దుర్మరణం.. అసలేమైందంటే..?

Drugs Seize: డ్రగ్స్ సరఫరాలో కొత్త ట్రెండ్.. మహిళలతో రహస్యంగా దందా.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu