AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: అందుకే ప్రీరిలీజ్ ఈవెంట్ లో కన్నీళ్లు పెట్టుకున్నా.. అసలు విషయం చెప్పిన సాయి పల్లవి..

న్యాచురల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.

Sai Pallavi: అందుకే ప్రీరిలీజ్ ఈవెంట్ లో కన్నీళ్లు పెట్టుకున్నా.. అసలు విషయం చెప్పిన సాయి పల్లవి..
Sai Pallavi
Rajeev Rayala
|

Updated on: Dec 22, 2021 | 4:52 PM

Share

Shyam Singha Roy: న్యాచురల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్రయూనిట్.. ఈ క్రమంలో హీరోయిన్ సాయి పల్లవి మీడియాతో ముచ్చటించింది. ఈ సినిమాలో సాయి పల్లవి దేవదాసిగా కనిపించనుంది. సాయి పల్లవి మాట్లాడుతూ..ప్రతి మూవీ నాకు నమ్మకం కలిగాకే చేస్తా.. అని అంది. అలాగే స్క్రిప్ట్ చదివేటప్పుడు ‘సినిమా ఇలా ఉంటుంది, నా పాత్ర అలా చేయొచ్చు’ అని ఒక‌ ఐడియా వస్తుంది. చిన్నప్పుడు మనం చరిత్ర చ‌దువుతున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని ఊహించుకుని ఉంటాం. శ్యామ్ సింగరాయ్‌లో స్క్రిప్ట్ చ‌దివేటప్పుడు దేవదాసి క్యారెక్టర్ ఎలా చేయాలి అనేదాని కంటే వాళ్ల సైకాలజీ ఎలా ఉంటుంది అని చెప్పడం నచ్చింది అని చెప్పుకొచ్చింది పల్లవి. వేరే సినిమాల‌తో పోలిస్తే ఈ సినిమాను సైకాలజీ ప‌రంగా చేశాను అంది.

చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అయితేనే సాయి ప‌ల్లవి ఓకే చేస్తుందా అంటే అలా ఏం లేదండి! అవ‌న్ని నేను న‌మ్మి చేశాను..మీకు కూడా న‌చ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను డాన్స్ ఎక్కువ చేసింది ‘లవ్ స్టోరీ’లోనే అనుకుంటా..ఈ సినిమాలో డాన్స్ ఎంత కావాలో… అంతే పెట్టారు. నాకు క్లాసికల్ డాన్స్ రాదు. ఇప్పటి వరకు నేర్చుకోలేదు. నేను చేయగలుగుతానని రాహుల్ నమ్మారు. నాతో పాటు పాటలో క్లాసికల్ డాన్స్ చేసిన వారు చాలా ఎక్స్‌పీరియ‌న్స్ ఉన్నవాళ్లు అని తెలిపింది. ఆ పాటకు డాన్స్ చేసేటప్పుడు చాలా భయపడ్డాను. వాళ్లతో ఒకేలా చేశానని అంటే అదే పెద్ద సక్సెస్ అనుకున్నాను. అలాగే దేవదాసి వ్యవస్థ గురించి పాఠశాలలో చదివా. దేవదాసీలు ప్రారంభంలో దేవుడికి సేవకులుగా ఉన్నారు. తర్వాత తర్వాత దాన్ని మార్చేశారు. వాళ్ల గురించి పూర్తిగా చూపించ‌లేదు మా సినిమాకు ఎంత కావాలో అంతే తీసుకున్నాం. ‘శ్యామ్ సింగ రాయ్’ పాత్రతో పాటు దేవ‌దాసి పాత్ర ఎంత చూపించాలో, అంతే చూపించారు. ఇది పూర్తిగా దేవదాసి వ్యవస్థపై తీసిన సినిమా కాదు.

అలాగే ‘శ్యామ్ సింగ రాయ్స ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు కృతజ్ఞతతో వ‌చ్చాయి. అది మాత్రమే కాదు…ఆ పాట అనురాగ్ కులకర్ణి పాడారు. మనం ఒక కళను ఎంజాయ్ చేయడమే పెద్ద ఇది. మనకు ఏమీ రాకున్నా ఎంజాయ్ చేయగలుగుతాం. అదే దేవుడు ఇచ్చిన పెద్ద ఆశీర్వాదం. అవన్నీ చూసి ఎమోషనల్ అయ్యాను. నా బ్రెయిన్ లో నేను మామూలు సాయి పల్లవినే. అయితే…నేను చేసే సినిమాలు చాలామందికి సంతోషం ఇస్తుందంటే ఎమోషనల్ అయ్యాను. నేను రుణపడ్డాను. నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలకు… ప్రేక్షకులు అందరికీ థాంక్స్ చెప్పాలని అనుకున్నాను.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Naga Chaitanya: నాగచైతన్య వెబ్ సిరీస్ ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. చైతూ అలా కనిపించనున్నాడట..

Vijayawada: ఏపీలో కొనసాగుతున్న థియేటర్ల తనిఖీలు.. కృష్ణా జిల్లాలో 15 థియేటర్లు సీజ్‌..

Tollywood Rewind 2021: ఈ సంవత్సరం టాలీవుడ్‌ ఇండస్ట్రీని బతికించింది ఆ ముగ్గురే..