Tollywood Rewind 2021: ఈ సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీని బతికించింది ఆ ముగ్గురే..
Year Ender 2021: ఎన్ని హిట్లు.. ఎన్ని ఫట్లు అనేది అటుంచితే... ఇచ్చినంతవరకూ టాలీవుడ్‌కు బలంగానే ఇచ్చింది ఇయర్ 2021.

Tollywood Year Ender 2021: ఎన్ని హిట్లు.. ఎన్ని ఫట్లు అనేది అటుంచితే… ఇచ్చినంతవరకూ బలంగానే ఇచ్చింది ఇయర్ 2021. సుక్కూ-బన్నీ, బాలయ్య-బోయపాటి, గోపీచంద్-రవితేజ.. ఈ మూడు క్రేజీ కాంబినేషన్స్… ఈ ఏడాదిలోనే హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్స్‌ని చూసి తరించాయి. 2021 టాలీవుడ్ క్యాలెండర్ నుంచి దక్కిన రేరెస్ట్ ఫీట్ ఇది.
మాస్ మహరాజ్ రవితేజ-యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో థర్డ్ మూవీగా వచ్చిన క్రాక్… ఈ ఏడాది బాక్సాఫీసుల్ని గ్రాండ్‌గా ఓపెన్ చేసింది. వీళ్లిద్దరి నుంచి గతంలో వచ్చిన డాన్‌శీను, బలుపు సినిమాలు కూడా సూపర్‌హిట్టయ్యాయి. ఇయరెండ్‌లో ఇలాగే మరో రెండు కాంబినేషన్లు హ్యాట్రిక్ విక్టరీలు నమోదు చేసుకున్నాయి.
డిసెంబర్ ఫస్ట్ వీకెండ్‌లో రిలీజైన అఖండ మూవీ వంద కోట్ల గ్రాస్ సాధించి బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌ని మరింత స్ట్రాంగ్‌గా మార్చింది. గతంలో లెజెండ్, సింహా.. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమాలు.

Tollywood 2021
ఇక… సుకుమార్-అల్లు అర్జున్ కలయికలో వచ్చిన థర్డ్ మూవీ పుష్ప… క్రిస్మస్‌కి రిలీజై బిగ్ రేంజ్‌లో వసూళ్లు రాబట్టుకుంటోంది. గతంలో ఆర్య, ఆర్య2 సినిమాలకు కొనసాగింపుగా వచ్చిందే పుష్ప. ఇలా ఈ మూడు కాంబినేషన్ల హ్యాట్రిక్ విక్టరీలు 2021 క్యాలెండర్‌ని పుష్టిగా మార్చేశాయి.
– శ్రీహరి రాజా, ET డెస్క్, టీవీ9 తెలుగు
Also Read..
Year Ender 2021: టీ20ఐల్లో సిక్సర్ల కింగ్స్ వీరే.. లిస్టులో భారత బ్యాట్స్‌మెన్ ఒక్కడే..!