Central Government Pension Scheme: రోజుకు 7 రూపాయల పెట్టుబడితో రిటైర్మెంట్ తరువాత ప్రతి సంవత్సరం 60 వేల రూపాయలు పొందండిలా!

ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తరువాత కూడా తమ జీవనానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వారికి పెన్షన్ వచ్చే సౌకర్యం ఉంది. అయితే, ప్రయివేట్ రంగ ఉద్యోగులకు ఆ అవకాశం లేదు.

Central Government Pension Scheme: రోజుకు 7 రూపాయల పెట్టుబడితో రిటైర్మెంట్ తరువాత ప్రతి సంవత్సరం 60 వేల రూపాయలు పొందండిలా!
Pension Scheme
Follow us
KVD Varma

|

Updated on: Dec 22, 2021 | 2:21 PM

Central Government Pension Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తరువాత కూడా తమ జీవనానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వారికి పెన్షన్ వచ్చే సౌకర్యం ఉంది. అయితే, ప్రయివేట్ రంగ ఉద్యోగులకు ఆ అవకాశం లేదు. వారు పదవీ విరమణ పొందిన తరువాత ఆదాయం వచ్చే మార్గం ఉండదు. దీంతో వారి జీవనం భారంగా మారుతుంది. ఇటువంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రైవేట్ రంగ ఉద్యోగులు కూడా కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉన్న పెన్షన్ పథకంలో రోజుకు రూ. 7 కంటే తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా వారి పదవీ విరమణ తరువాత పెన్షన్ పొందవచ్చు.

ఈ పథకం పేరు అటల్ పెన్షన్ యోజన (APY). ఇది భారత ప్రభుత్వం నిర్వహించబడే పెన్షన్ పథకం. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ద్వారా నిర్వహించడం జరుగుతోంది. వారి పదవీ విరమణ తర్వాత హామీ ఇవ్వబడిన స్థిర మొత్తాన్ని పెన్షన్‌గా పొందాలని చూస్తున్న వ్యక్తుల కోసం, APY ఒక ఆకర్షణీయమైన ఎంపిక. అసంఘటిత రంగంలోని ప్రజలకు వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం 2015లో పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది.

APYలో ఎవరు పెట్టుబడి పెట్టగలరు

బ్యాంకు ఖాతా కలిగి.. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. 18-40 సంవత్సరాల వయస్సు గల భారతీయ పౌరులు ఎవరైనా అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టె అవకాశం ఉంది. నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) ఆర్కిటెక్చర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనను నిర్వహిస్తుంది.

అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు 60 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ సమయంలో ప్రయోజనాలను పొందడం ప్రారంభిస్తారు. అంటే పెట్టుబడిదారులు ఈ పథకంలో కనీసం 20 సంవత్సరాలు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది.

ఈ పథకంలో పెట్టుబడిదారులు మరణించే వరకు నెలవారీ పింఛను పొందుతారు. పెట్టుబడిదారుడు మరణించిన సందర్భంలో, అతని/ఆమె జీవిత భాగస్వామి మరణించే వరకు పెన్షన్ పొందుతూనే ఉంటారు. పెట్టుబడిదారు మరియు జీవిత భాగస్వామి మరణించిన సందర్భంలో, మొత్తం కార్పస్ నామినీ ఖాతాలోకి బదిలీ చేస్తారు.

ఈ పథకంలో, పెట్టుబడిదారుడు ఐదు నెలవారీ పెన్షన్ ఎంపికలను పొందుతాడు. రూ. 1,000, రూ. 2,000, రూ. 3,000, రూ. 4,000, రూ. 5,000. అతను/ఆమె పదవీ విరమణ తర్వాత పొందాలనుకునే పెన్షన్ మొత్తాన్ని, అతని/ఆమె వయస్సును బట్టి, నెలవారీ కంట్రిబ్యూషన్ మొత్తం నిర్ణయిస్తారు. ఉదాహరణకు, మీకు 18 సంవత్సరాలు ఉన్నాయనుకుందాం. మీరు 60 సంవత్సరాల వయస్సు నుంచి నెలవారీ పెన్షన్ రూ. 5,000 కావాలంటే, మీరు నెలకు రూ. 210 పెట్టుబడి పెట్టాలి, ఇది రోజుకు రూ. 7 పెట్టుబడికి సమానం.

చందాదారుడు ఆలస్యంగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, అదే పెన్షన్ మొత్తానికి (రూ. 5000) అవసరమైన కంట్రిబ్యూషన్ మొత్తం పెరుగుతుంది. ఉదాహరణకు, మీరు గరిష్ట ప్రవేశ వయస్సు అయిన 40 సంవత్సరాల వయస్సులో APYలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, రూ. 5,000 నెలవారీ పెన్షన్ లేదా RS 60,000 వార్షిక పెన్షన్ పొందడానికి మీరు నెలకు రూ. 1,454 విరాళంగా చెల్లించాల్సి ఉంటుంది. పై చార్ట్ ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో పెన్షన్ పొందడానికి మీరు నెలవారీ పెట్టుబడి పెట్టవలసిన మొత్తాన్ని సూచిస్తుంది. అలాగే, మీరు ప్రతి నెలా చెల్లించే ప్రీమియం సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపుకు అర్హత పొందుతుంది.

ఇవి కూడా చదవండి: OnePlus 10 Pro: జనవరిలో మార్కెట్లోకి వన్ ప్లస్ 10 ప్రొ.. మొదటగా చైనాలోనేనా..

83: ‘ఆనాటి భారత విజయం.. ప్రపంచ క్రికెట్ భవిష్యత్తుకు మేల్కొలుపు’

Viral news: పంది గీసిన పెయింటింగ్‌కు రూ. 20 లక్షలు! అబ్బుర పరుస్తోన్న మూగజీవి క్రియేటివిటీ..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?