Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral news: పంది గీసిన పెయింటింగ్‌కు రూ. 20 లక్షలు! అబ్బుర పరుస్తోన్న మూగజీవి క్రియేటివిటీ..

మనుషులు చేసే అన్ని పనులు దాదాపు మూగజీవాలు కూడా చేస్తాయి. అందుకే చాలామంది వాటిని ఇంట్లో కుటుంబ సభ్యులతో సమానంగా పెంచుకుంటుంటారు. ఈనేపథ్యంలో ఓ పంది ఎంచక్కా కుంచె పట్టి అందమైన చిత్రాలు గీసేస్తోంది

Viral news: పంది గీసిన పెయింటింగ్‌కు రూ. 20 లక్షలు! అబ్బుర పరుస్తోన్న మూగజీవి క్రియేటివిటీ..
Follow us
Basha Shek

|

Updated on: Dec 21, 2021 | 6:05 PM

మనుషులు చేసే అన్ని పనులు దాదాపు మూగజీవాలు కూడా చేస్తాయి. అందుకే చాలామంది వాటిని ఇంట్లో కుటుంబ సభ్యులతో సమానంగా పెంచుకుంటుంటారు. ఈనేపథ్యంలో ఓ పంది ఎంచక్కా కుంచె పట్టి అందమైన చిత్రాలు గీసేస్తోంది. పైగా ఈ పెయింటింగ్స్‌ను ఆన్‌లైన్‌లో వేలం వేస్తే లక్షలు పలుకుతున్నాయి. తాజాగా ఈ పంది గీసిన ఓ పెయింటింగ్‌ జర్మనీకి చెందిన పీటర్‌ ఎసర్‌ అనే వ్యక్తికి తెగ నచ్చేసింది. ఎంతలా అంటే రూ. 20 లక్షలు చెల్లించి మరీ వేలంలో ఈ పెయింటింగ్‌ను దక్కించుకునేటంత. ఇలా ఈ పంది గీసిన చిత్రాలు లక్షలు పలకడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలోనూ ఎంతో మంది భారీగా డబ్బులిచ్చి ఈ పెయింటింగ్స్‌ను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఈ మూగజంతువు సృజనాత్మకత గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

కుంచె పట్టి కాన్వాస్‌పై .. దక్షిణాఫ్రికాలోని పశ్చిమ కేప్‌ ప్రాంతానికి చెందిన జాన్నే లెఫ్సాన్‌ అనే ఓ మహిళా స్థానికంగానే ఫామ్‌ శాంక్చ్యూరీని నిర్వహిస్తోంది. లెఫ్సాన్‌కు 2016లో జంతు వధశాలలో ఓ పంది కనిపించింది. దీంతో ఆ మూగజీవిని అక్కడి నుంచి రక్షించిన లెఫ్సాన్‌ తన శాంక్య్చూరీకి తీసుకెళ్లింది. అనంతరం కొన్నేళ్ల తర్వాత ఆ వరాహంలోని ప్రతిభను గుర్తించిన లెఫ్సాన్‌ దానితో చిత్రాలు వేయించడం ప్రారంభించింది. వరాహం కూడా నోటితో కుంచెను పట్టుకొని బొమ్మలు గీయం మొదలు పెట్టేసింది. దీంతో ఆ పంది గీస్తోన్న చిత్రాలను లెఫ్సాన్‌ నెట్టింట్లో పోస్ట్‌ చేయడం మొదలు పెట్టింది. ఆ పందికి ‘పిగాసో’ అని పేరు పెట్టి.. ఆ పేరు మీదే సోషల్‌ మీడియా సైట్లలో అకౌంట్లను ఓపెన్‌ చేసింది. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియా వేదికగా పిగాసో గీసిన చిత్రాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బాగా వైరల్‌గా మారాయి. ఇక పిగాసోకు కలర్స్‌ వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్స్ట్‌ కలగకుండా లెఫ్సాన్‌ సహజంగా తయారు చేసిన రంగులను వాడడం విశేషం. ఇక పిగాసో గీసిన చిత్రాలు కేవలం వైరల్‌గా మారడానికే పరిమితం కాకుండా ఎంతో మంది నెటిజన్లను ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రాలను ఆన్‌లైన్‌లో వేలం వేయడం ప్రారంభించారు. అలా తాజాగా ‘పిగాసో’ గీసిన ఓ పెయింటింగ్‌ను జర్మనీకి చెందిన పీటర్‌ ఎసర్‌ రూ. 20 లక్షలు వెచ్చింది వేలంలో దక్కించుకున్నాడు. కాగా ఈ పెయింటింగ్స్‌ ద్వారా వచ్చిన మొత్తాన్ని జంతు సక్షేమ నిధికి ఉపయోగిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది లెఫ్సాన్‌.

View this post on Instagram

A post shared by Pigcasso (@pigcassohoghero)

Also Read:

Viral Video: తల్లి చిత్ర పటంతో పెళ్లి మండపానికొచ్చిన వధువు.. ఎమోషనల్‌ అవుతోన్న నెటిజన్లు..

Viral Video: మహిళలను ఆవులుగా చూపిస్తూ యాడ్‌.. డెయిరీ కంపెనీ ప్రమోషనల్‌ వీడియోపై వివాదం..

Vaccine Certificates: వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‎పై ప్రధాని ఫొటో ఉంటే తప్పేంటి.. పిటిషన్ కొట్టివేసిన కేరళ హైకోర్టు..