Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: చైనాను అనుసరించే ప్రయత్నం.. భారత సైనికుల హెచ్చరికతో వెనక్కి.. ఇది పాక్ తాజా నిర్వాకం!

పాకిస్తాన్ తన ప్రియమైన మిత్రుడు చైనా దారిలో నడిచే ప్రయత్నం చేసి భారత్ చేతిలో భంగపడింది. చైనా లానే ఇప్పుడు పాకిస్థాన్ కూడా భారత సరిహద్దు సమీపంలో నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది.

Pakistan: చైనాను అనుసరించే ప్రయత్నం.. భారత సైనికుల హెచ్చరికతో వెనక్కి.. ఇది పాక్ తాజా నిర్వాకం!
Pakistan At Loc
Follow us
KVD Varma

|

Updated on: Dec 21, 2021 | 6:53 PM

Pakistan: పాకిస్తాన్ తన ప్రియమైన మిత్రుడు చైనా దారిలో నడిచే ప్రయత్నం చేసి భారత్ చేతిలో భంగపడింది. చైనా లానే ఇప్పుడు పాకిస్థాన్ కూడా భారత సరిహద్దు సమీపంలో నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది. ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని టిట్వాల్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ మీదుగా 500 మీటర్ల వ్యాసార్థంలో ఈ నిర్మాణం జరుగుతోంది. డిసెంబరు 21న ఈ విషయం తెలుసుకున్న భారత సైన్యం మైక్‌లో పాకిస్థానీలను హెచ్చరించింది. ఈ హెచ్చరిక విన్న పాకిస్తాన్ నిర్మాణాన్ని నిలిపివేసింది. పాకిస్థాన్ ఈ చర్య ఎల్ఓసీ ప్రోటోకాల్‌కు విరుద్ధం.

భారత సైన్యం స్ట్రాంగ్ వార్నింగ్..

ఇండియన్ ఆర్మీ అధికారి మైక్‌లో, ”ఈ అక్రమ నిర్మాణాన్ని ఆపండి, మీరు మా మాట వినకపోతే, మేము తదుపరి చర్య తీసుకోవలసి ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం, మీరు ఈ స్థలంలో ఏమీ చేయలేరు, కాబట్టి ఈ పనిని ఆపండి. మీరు 500 మీటర్లలోపు ఒక భాగంలో నిర్మాణ పనులు చేస్తున్నారు. మేము మిమ్మల్ని మళ్లీ మళ్లీ అభ్యర్థిస్తున్నాము.. మీరు ఇప్పుడు పనిని ఆపకపోతే, మేము అభ్యర్థించము. మేము ఇతర చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుంది.” అంటూ హెచ్చరించారు.

సైన్యంతో పాటు, తిత్వాల్ సెక్టార్‌లో స్థిరపడిన గ్రామస్థులు కూడా పాకిస్తాన్ తన నిర్మాణాన్ని వెంటనే ఆపాలని మైక్‌లో మాట్లాడారు. గ్రామస్థులు మైక్‌లో ప్రకటన కూడా చేసారు. పాకిస్తాన్‌ను హెచ్చరించారు- ‘దయచేసి మీరు నిర్మాణాన్ని ఆపాలని గ్రామస్తులందరూ కోరుతున్నాము.’ అంటూ వారు పాక్ కు సూచించారు.

పాకిస్థానీలు పనిని నిలిపివేశారు: కుప్వారా పోలీసులు కుప్వారా ఎస్‌ఎస్‌పి యుగల్ మీడియాతో మాట్లాడుతూ టిట్వాల్ సెక్టార్‌లో పాకిస్థాన్ అక్రమ నిర్మాణాలు చేసేందుకు ప్రయత్నించిందని ధృవీకరించారు. నియంత్రణ రేఖకు 500 మీటర్ల లోపు నిర్మాణాలు చేయలేమని చెప్పారు. కానీ తాము అభ్యంతరం చెప్పడంతో పాకిస్థాన్ వైపు నుంచి నిర్మాణాన్నినిలిపివేశారని ఆయన చెప్పారు.

అరుణాచల్‌లో చైనా ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసింది

తాజాగా, భారత సరిహద్దుకు ఆనుకుని ఉన్న ప్రాంతాలను చైనా మళ్లీ ఆక్రమించుకోవడం ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి. కొత్త ఉపగ్రహ చిత్రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని మరో చైనీస్ గ్రామాన్ని గుర్తించాయి. ఇందులో దాదాపు 60 భవనాలు ఉన్నాయని పేర్కొన్నారు. అరుణాచల్‌లో 60 భవనాలున్న గ్రామాన్ని చైనా ఏర్పాటు చేసిందని శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైంది. శాటిలైట్ చిత్రాల ప్రకారం, 2019 వరకు ఈ ప్రాంతంలో ఒక్క ఎన్‌క్లేవ్ కూడా లేదు. కానీ, రెండేళ్ల తర్వాత చైనా దానిని స్వాధీనం చేసుకుని నిర్మించింది. గతంలో కూడా అరుణాచల్‌లోని కొంత భాగాన్ని చైనా సైన్యం ఆక్రమించినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి: OnePlus 10 Pro: జనవరిలో మార్కెట్లోకి వన్ ప్లస్ 10 ప్రొ.. మొదటగా చైనాలోనేనా..

83: ‘ఆనాటి భారత విజయం.. ప్రపంచ క్రికెట్ భవిష్యత్తుకు మేల్కొలుపు’

Viral news: పంది గీసిన పెయింటింగ్‌కు రూ. 20 లక్షలు! అబ్బుర పరుస్తోన్న మూగజీవి క్రియేటివిటీ..

ఎలారా ఇలా.! బైకుల మాటున బద్మాష్ సిత్రాలు.. మ్యాటర్ తెలిస్తే
ఎలారా ఇలా.! బైకుల మాటున బద్మాష్ సిత్రాలు.. మ్యాటర్ తెలిస్తే
ఇంటర్‌ తర్వాత సర్కార్ కొలువు దక్కించుకునే ఛాన్స్.. మిస్ కావొద్దు!
ఇంటర్‌ తర్వాత సర్కార్ కొలువు దక్కించుకునే ఛాన్స్.. మిస్ కావొద్దు!
వాట్సాప్ లో కొత్తగా మూడు ఫీచర్లు.. ఇక యూజర్లకు పండగే..!
వాట్సాప్ లో కొత్తగా మూడు ఫీచర్లు.. ఇక యూజర్లకు పండగే..!
240 స్ట్రైక్ రేట్‌తో పూరన్ బీభత్సం.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్
240 స్ట్రైక్ రేట్‌తో పూరన్ బీభత్సం.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్
పవన్ కల్యాణ్ కొడుకు ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా..!
పవన్ కల్యాణ్ కొడుకు ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా..!
వాట్సాప్‌లో ఇన్‌స్టా రీల్స్‌.. కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చిన మెటా
వాట్సాప్‌లో ఇన్‌స్టా రీల్స్‌.. కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చిన మెటా
పాపం.. వాటి కోసం.. అర్ధరాత్రి ఆలయానికి అనుకోని అతిథులు..
పాపం.. వాటి కోసం.. అర్ధరాత్రి ఆలయానికి అనుకోని అతిథులు..
ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా…? ఈ జాగ్రత్తలు తీసుకోవడం మస్ట్..!
ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా…? ఈ జాగ్రత్తలు తీసుకోవడం మస్ట్..!
Team India: బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ క్రికెటర్..
Team India: బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ క్రికెటర్..
ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్..ఏంటో తెలుసా?
ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్..ఏంటో తెలుసా?
ఎలారా ఇలా.! బైకుల మాటున బద్మాష్ సిత్రాలు.. మ్యాటర్ తెలిస్తే
ఎలారా ఇలా.! బైకుల మాటున బద్మాష్ సిత్రాలు.. మ్యాటర్ తెలిస్తే
వాట్సాప్‌లో ఇన్‌స్టా రీల్స్‌.. కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చిన మెటా
వాట్సాప్‌లో ఇన్‌స్టా రీల్స్‌.. కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చిన మెటా
పాపం.. వాటి కోసం.. అర్ధరాత్రి ఆలయానికి అనుకోని అతిథులు..
పాపం.. వాటి కోసం.. అర్ధరాత్రి ఆలయానికి అనుకోని అతిథులు..
నిత్యానంద ఎవరు ?? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి ??
నిత్యానంద ఎవరు ?? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి ??
బాత్రూంలో మనిషి జలకాలాట.. ఇంతలో లోపలికి వచ్చిన అనుకోని అతిధి
బాత్రూంలో మనిషి జలకాలాట.. ఇంతలో లోపలికి వచ్చిన అనుకోని అతిధి
దేవరని వెనక్కి నెట్టి.. చరిత్ర సృష్టించిన పెద్ది
దేవరని వెనక్కి నెట్టి.. చరిత్ర సృష్టించిన పెద్ది
OTTలోకి కోర్టు మూవీ.. అఫీషియల్‌ డేట్‌ వచ్చేసింది..
OTTలోకి కోర్టు మూవీ.. అఫీషియల్‌ డేట్‌ వచ్చేసింది..
తోపులే జడుసుకున్నారు.. ఈ క్రూజ్‌ టూర్‌కి గుండె ధైర్యం ఉందా?వీడియో
తోపులే జడుసుకున్నారు.. ఈ క్రూజ్‌ టూర్‌కి గుండె ధైర్యం ఉందా?వీడియో
పోలీసు అధికారులకు వైఎస్ జగన్ వార్నింగ్.. వారికి శిక్ష తప్పదంటూ..
పోలీసు అధికారులకు వైఎస్ జగన్ వార్నింగ్.. వారికి శిక్ష తప్పదంటూ..
పెళ్లి పీటలెక్కాల్సి ఉండగా.. మృత్యుఒడికి.. వీడియో
పెళ్లి పీటలెక్కాల్సి ఉండగా.. మృత్యుఒడికి.. వీడియో