OnePlus 10 Pro: జనవరిలో మార్కెట్లోకి వన్ ప్లస్ 10 ప్రొ.. మొదటగా చైనాలోనేనా..
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు సంస్థ వన్‌ప్లస్ వచ్చే ఏడాది జనవరిలో వన్‌ప్లస్ 10 ప్రోని విడుదల చేయనుంది...
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు సంస్థ వన్‌ప్లస్ వచ్చే ఏడాది జనవరిలో వన్‌ప్లస్ 10 ప్రోని విడుదల చేయనుంది. ఈ విషయాన్ని OnePlus CEO, సహ-వ్యవస్థాపకుడు పేటె లా, డిసెంబర్ 21న ప్రకటించారు. ఖచ్చితమైన లాంచ్ తేదీని ఆయన నిర్దారించలేదు. OnePlus 10 ప్రో Qualcomm Snapdragon 8 Gen 1 చిప్‌సెట్ వంటి హై ఎండ్ ఫీచర్లతో పని చేస్తుంది. OnePlus 10 రూపంలో ఒక బేస్ వేరియంట్‌ను లాంచ్ చేస్తుందని కూడా భావిస్తున్నారు. BBK ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, OnePlus, OnePlus 10 సిరీస్‌ను ముందుగా చైనాలో లాంచ్ చేస్తుందని తెలుస్తుంది.
OnePlus 10 సిరీస్ 8GB RAM, 128GB ROM, 12GB వేరియంట్లలో రావొచ్చని భావిస్తున్నారు. వన్‌ప్లస్ 9 సిరీస్‌తో చేసినట్లుగా హాసెల్‌బ్లాడ్‌తో వన్‌ప్లస్ దాని అనుబంధాన్ని కొనసాగిస్తుందా అనేది చూడటం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా OnePlus 4,500mAh కేటగిరీలో బ్యాటరీ ఉపయోగిస్తుంది. ఈ ఫోన్ Snapdragon 8 Gen 1తో పని చేయనుంది. ఇది Android 12తో రానుంది. డిస్ప్లే 6.78 అంగుళాలు ఉండనుంది.
Read Also.. Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 497, నిఫ్టీ 157 పాయింట్ల వృద్ధి..