PM Modi with CEOs: వ్యవసాయం.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెంచండి.. కంపెనీల సీఈవోలకు ప్రధాని మోడీ సూచన!
వచ్చే ఏడాది బడ్జెట్ సిద్ధం చేయడానికి అవసరమైన ఇన్‌పుట్‌ల కోసం బ్యాంకింగ్ నుంచి టెలికాం, ఎలక్ట్రానిక్స్, హెల్త్, హాస్పిటాలిటీ అలాగే ఇతర రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు.
PM Modi with CEOs: వచ్చే ఏడాది బడ్జెట్ సిద్ధం చేయడానికి అవసరమైన ఇన్‌పుట్‌ల కోసం బ్యాంకింగ్ నుంచి టెలికాం, ఎలక్ట్రానిక్స్, హెల్త్, హాస్పిటాలిటీ అలాగే ఇతర రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. గత వారం, ఆయన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ప్లేయర్‌లను కలుసుకున్నారు. భారతదేశంలోకి పెట్టుబడులను తీసుకురావడానికి సూచనలను కోరారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2022న బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
ప్రతి రంగంలోనూ మన పరిశ్రమలు ప్రపంచంలోని టాప్ 5లో ఉండాలని దేశం కోరుకుంటోందని.. ఇందుకోసం మనం సమిష్టిగా కృషి చేయాలని ప్రధాని ఈ సందర్భంగా వారికీ చెప్పారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో కార్పొరేట్ రంగం ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని, సహజ వ్యవసాయం వైపు దృష్టి సారించాలని ఆయన అన్నారు. దేశ ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చే ఇలాంటి చర్యలన్నీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. సమ్మతి భారాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించడం గురించి కూడా ఆయన చెప్పారు మరియు సమ్మతి గురించి సలహాలను కూడా కోరారు.
పీఎంకు కంపెనీల సీఈవోల ప్రశంసలు
సమావేశంలో పాల్గొన్న కంపెనీల సీఈవోలు తమ అభిప్రాయాలను ప్రధానికి వివరించారు. ప్రైవేట్ రంగంపై విశ్వాసం ఉంచినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. పీఎం గతిశక్తి, ఐబీసీ వంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కొనియాడారు. దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మరింత ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా వారు ప్రస్తావించారు. COP26 వద్ద భారతదేశం యొక్క నిబద్ధత.. లక్ష్యాలను సాధించడంలో పరిశ్రమ ఎలా దోహదపడుతుందనే దాని గురించి కూడా వారు ప్రధానికి తమ సూచనలు అందచేశారు. ఈ సందర్భంగా టిసిఎస్ సిఇఒ రాజేష్ గోపీనాథన్ మాట్లాడుతూ, “పరిశ్రమలోని ప్రతి రంగంలో, ప్రపంచంలోని మొదటి ఐదు స్థానాల్లో భారతదేశం ఉండాలని ప్రధాన మంత్రికి స్పష్టమైన విజన్ ఉంది.” అన్నారు.
ఇవి కూడా చదవండి: OnePlus 10 Pro: జనవరిలో మార్కెట్లోకి వన్ ప్లస్ 10 ప్రొ.. మొదటగా చైనాలోనేనా..
83: ‘ఆనాటి భారత విజయం.. ప్రపంచ క్రికెట్ భవిష్యత్తుకు మేల్కొలుపు’
Viral news: పంది గీసిన పెయింటింగ్‌కు రూ. 20 లక్షలు! అబ్బుర పరుస్తోన్న మూగజీవి క్రియేటివిటీ..