IIT Bombay: ముంబై ఐఐటీలో కరోనా కలకలం.. ఏడుగురు విద్యార్థులకు పాజిటివ్..

ఐఐటీ ముంబైలోని ఏడుగురు విద్యార్థులకు సోమవారం కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. విద్యార్థులందరికీ పూర్తిగా టీకాలు వేశారు...

IIT Bombay: ముంబై ఐఐటీలో కరోనా కలకలం.. ఏడుగురు విద్యార్థులకు పాజిటివ్..
Iit
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 21, 2021 | 8:05 PM

ఐఐటీ ముంబైలో కరోనా కలకలం రేగింది. ఏడుగురు విద్యార్థులకు సోమవారం కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది.  దీంతో ఇంకా ఎంత మంది విద్యార్థులకు వైరస్ సోకిందోనని భయపడుతున్నారు. విద్యార్థులందరికీ పూర్తిగా టీకాలు వేశారు. అయినా వారికి కరోనా సోకింది. మొత్తం ఏడుగురు తేలికపాటి లక్షణాలతో ఐసోలేషన్‎లో ఉన్నారు. వారిలో ఐదుగురు ఒకే హాస్టల్‎లో ఉంటున్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) హాస్టల్‌ను సీజ్ చేసింది. అధికారులు కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ పంపారు.

దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసుల దృష్ట్యా, పూర్తిగా వ్యాక్సినేషన్ చేసిన తర్వాత కూడా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్‌లు కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్‌పై పనిచేయవని సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవని ప్రభుత్వం చెప్పినప్పటికీ, స్పైక్ జన్యువు ఉత్పరివర్తనలు ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్‌ల సామర్థ్యాన్ని తగ్గించవచ్చని మంగళవారం రాజ్యసభకు తెలియజేసింది. ” ఒమిక్రాన్ ఎదుర్కొనే సమర్థత టీకా ఉందా, లేదా అనే దానిపై ఇప్పటివరకు పరిమిత డేటా అందుబాటులో ఉంది. ” అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా రాతపూర్వక సమాధానంలో తెలిపారు.

ఈ వేరియంట్‌కు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దేశంలో ఇచ్చే టీకాలు ప్రభావవంతంగా ఉన్నాయా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. “అయితే, టీకా రక్షణ అనేది యాంటీబాడీస్ ద్వారా అలాగే సెల్యులార్ ఇమ్యూనిటీ ద్వారా కూడా ఉంటుంది. ఇది సాపేక్షంగా సంరక్షించస్తుందని భావిస్తున్నారు. అందువల్ల టీకాలు ఇప్పటికీ తీవ్రమైన వ్యాధి నుంచి రక్షణను అందిస్తాయని, అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లతో టీకాలు వేయడం చాలా కీలకం” అని చెప్పారు.

Read Also.. PM Modi with CEOs: వ్యవసాయం.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెంచండి.. కంపెనీల సీఈవోలకు ప్రధాని మోడీ సూచన!

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..