Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Gandhi: నా పిల్లల ఇన్‎స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు.. ప్రియాంక గాంధీ సంచలన ఆరోపణలు..

కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జ్ ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం సోషల్ మీడియాలో తన పిల్లలను వేటాడుతుందని ఆరోపించారు....

Priyanka Gandhi: నా పిల్లల ఇన్‎స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు.. ప్రియాంక గాంధీ సంచలన ఆరోపణలు..
Priyanka Gandhi
Follow us
Srinivas Chekkilla

| Edited By: Anil kumar poka

Updated on: Dec 23, 2021 | 6:26 PM

కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జ్ ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం సోషల్ మీడియాలో తన పిల్లలను వేటాడుతుందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా నా పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కూడా హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. వారికి వేరే పని లేదా? అంటూ ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘మా ఫోన్లన్నీ ట్యాప్ చేస్తున్నారు.. మా సంభాషణలు రికార్డ్ చేస్తున్నారు.. పార్టీ ఆఫీసులోని ఫోన్లన్నీ వింటున్నారు.. సాయంత్రం కొన్ని రికార్డింగ్‎లను సీఎం స్వయంగా వింటున్నారు. అంటూ ఆరోపించారు.

గత ఎన్నికలలో ఘోరమైన ఒటమి తర్వాత పార్టీ అధికారంలోకి తీసుకురావడాన్ని సవాలుగా తీసుకున్న ఆమె మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఎన్నికలకు ముందు మహిళలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నగదు చేరవేత పథకంపై కూడా ఆమె ప్రశ్నించారు. ఈ పథకం ఉత్తరప్రదేశ్ మహిళల విజయంగా అభివర్ణించారు.

Read Also.. IIT Bombay: ముంబై ఐఐటీలో కరోనా కలకలం.. ఏడుగురు విద్యార్థులకు పాజిటివ్..