Viral Video: మహిళలను ఆవులుగా చూపిస్తూ యాడ్.. డెయిరీ కంపెనీ ప్రమోషనల్ వీడియోపై వివాదం..
ఏ కార్పొరేట్ సంస్థైనా తమ ఉత్పత్తుల గురించి ప్రచారం చేసుకోవాలంటే మార్కెటింగ్ ప్రమోషన్ తప్పనిసరి. అందులోనూ యాడ్స్(ప్రకటనలు) ద్వారా అయితే వేగంగా, ఎక్కువ మందికి కంపెనీ గురించి తెలుస్తుంది.
ఏ కార్పొరేట్ సంస్థైనా తమ ఉత్పత్తుల గురించి ప్రచారం చేసుకోవాలంటే మార్కెటింగ్ ప్రమోషన్ తప్పనిసరి. అందులోనూ యాడ్స్(ప్రకటనలు) ద్వారా అయితే వేగంగా, ఎక్కువ మందికి కంపెనీ గురించి తెలుస్తుంది. ఇందులో భాగంగానే క్రియేటివిటీతో కూడిన రకరకాల యాడ్స్‌ను రూపొందిస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఈ క్రియేటివిటీ శ్రుతిమించి కాంట్రవర్సీలకు దారి తీస్తుంటాయి. ఇటీవల పలు ప్రముఖ కంపెనీలు రూపొందించిన ప్రకటనలు ఇలాగే వివాదాల్లో చిక్కుకున్నాయి. తాజాగా దక్షిణ కొరియాకు చెందిన అతి పెద్ద డెయిరీ కంపెనీ సియోల్ మిల్స్ కూడా ఇలాగే వార్తల్లో నిలిచింది. తన డెయిరీ ఉత్పత్తుల ప్రమోషన్ కోసం రూపొందించిన ఓ యాడ్‌లో మహిళలను ఆవులుగా చూపించారు. దీంతో ఆ దేశవ్యాప్తంగా మహిళలు ఆందోళనకు దిగారు. దీంతో నాలుక కరుచుకున్న సియోల్ మిల్స్ వెంటనే ఆ యాడ్‌ను ఉపసంహరించుకుంది.
సియోల్ మిల్స్ రూపొందించిన ఈ కాంట్ర్సవర్సీ యాడ్‌లో ఓవ్యక్తి గ్రామీణ ప్రాంతాల్లో ఫొటోలు తీస్తూ తిరుగుతూ ఉండగా పొలంలో ఉన్న మహిళలు కనిపిస్తారు. వీరంతా అడవిలో జలపాతాల వద్ద నీళ్లు తాగి.. పక్కనే గడ్డిపోచల మీద యోగా చేస్తుంటారు. వీళ్లను గమనించిన ఆ వ్యక్తి ఫోటో తీసేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతలోనే అతని కాలి కింద ఉన్న ఓ కట్టె పుల్ల విరిగి శబ్దం వస్తుంది. వెంటనే ఆ ఫొటోగ్రాఫర్ కిందికి చూస్తాడు. ఆతర్వాత పైకి చూసేసరికి అక్కడ మహిళలు కనిపించరు. ఒక్కసారిగా మహిళలు ఆవులుగా మారిపోతారు. దీంతో అతడు ఆశ్చర్యానికి గురవుతాడు. ఈ యాడ్ ఉద్దేశమేమిటంటే .. ప్రకృతి ఒడిలో తిరిగే తమ సంస్థ ఆవులు స్వచ్ఛమైన నీరు తాగి, లేత పచ్చిక బయళ్లను తిని స్వచ్ఛమైన పాలనిస్తాయని చెప్పడం. క్రియేటివిటీ బాగానే ఉన్నప్పటికీ ఇందులోకి అందమైన మహిళలను ఉపయోగించుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీంతో ఈ యాడ్‌ను సియోల్ మిల్క్ తన సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన కొద్ది సేపటికే వైరల్‌గా మారింది. మహిళలను జంతువులుగా చూపించడమేంటి? అంటూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు రేగాయి. అదేవిధంగా మహిళలను అలా రహస్యంగా వీడియోలు, ఫోటోలు తీయడం కూడా చట్ట విరుద్ధమంటూ సోషల్ మీడియా వేదికగా నిరసనలకు దిగారు. దీంతో ఎట్టకేలకు సియోల్ మిల్స్ ఈ యాడ్‌ను సోషల్ మీడియా నుంచి తొలగించింది. యాడ్ రూపకల్పణలో మరింత జాగ్రత్తగా ఉంటామని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామమని క్షమాపణలు చెప్పింది.
Also read:
Viral Video: కొంగలకు వార్నింగ్ ఇచ్చిన గున్న ఏనుగు.. వీడియో చూస్తే మీరే షాకవుతారు..