Viral Video: ఇద్దరి ఫ్రెండ్‌షిప్ మామూలుగా లేదుగా..! కోతి దొంగతనానికి సాయం చేసిన కుక్క.. షాకింగ్ వీడియో

Monkey Dog Friendship Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే.. సాధారణంగా

Viral Video: ఇద్దరి ఫ్రెండ్‌షిప్ మామూలుగా లేదుగా..! కోతి దొంగతనానికి సాయం చేసిన కుక్క.. షాకింగ్ వీడియో
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 21, 2021 | 2:10 PM

Monkey Dog Friendship Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే.. సాధారణంగా కోతులు, కుక్కల మధ్య అస్సలే సయోధ్య కుదరదు. వీటిమధ్య పోరాటానికి సంబంధించిన వార్తలు ఇటీవల చాలానే వెలుగులోకి వచ్చాయి. కోతుల గుంపు.. కుక్కలను చంపిన ఘటనకి సంబంధించి #MonkeyVsDog అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. కోతులు, కుక్కల మధ్య ఈ గ్యాంగ్ వార్ కారణంగా.. నెటిజన్లు ట్విట్టర్‌లో ఫన్నీ మీమ్‌లను కూడా పంచుకుంటున్నారు. దీనిపై చాలా మంది తమాషాగా స్పందిస్తున్నారు. అయితే వీటన్నింటి మధ్యలో కోతి, కుక్కకు సంబంధించిన ఫన్నీ వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇది చూసి నెటిజన్లంతా తెగ నవ్వుకుంటున్నారు.

వాస్తవానికి స్నేహం అనేది ఎప్పుడూ రంగు, రూపం, స్వరూపం చూసి పుట్టదంటారు. బహుశా అందుకే స్నేహ బంధాన్ని స్వర్గానికి సంబంధించినదిగా వర్ణిస్తుంటారు. ఇది ప్రేమ, విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి స్నేహం గురించి మీరు చాలా కథలు విని ఉంటారు. అచ్చం అలాంటి స్నేహమే.. ఓ కోతి.. కుక్క మధ్య చిగురించింది. ఈ రెండు కలిసి దుకాణంలో దొంగతనం చేస్తూ కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. కుక్క మీద కోతి కూర్చొని ఉండటాన్ని మీరు చూడవచ్చు. రెండూ కలిసి చిప్స్ ప్యాకెట్లను దొంగతనం చేసేందుకు ప్లాన్ వేశాయి. కుక్క షాపు దగ్గర నిలబడి ఉండగా.. దానిపైన ఉన్న కోతి చిప్స్‌ దొంగిలించేందుకు ట్రై చేస్తుంది. చిప్స్ ప్యాకెట్ చింపేదుకు ప్రయత్నిస్తూ.. కిందకు దూకుతుంది. మళ్లీ చింపేదుకు కుక్క పైకి ఎక్కుతుంది కోతి. ఈ సరదా సన్నివేశాన్ని అక్కడున్న ఒకరు వీడియోను తీసి.. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.

వైరల్ వీడియో.. 

ఈ ఫన్నీ వీడియోను naughty.raa అనే యూజర్ ఇన్‌స్టాలో షేర్ చేసారు. ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించి.. పలు కామెంట్లు చేస్తున్నారు. ఈ స్నేహాన్ని చాలా స్వీట్ ఫ్రెండ్‌షిప్‌గా వర్ణిస్తూ.. పలు కామెంట్లు చేస్తున్నారు. ఈ రెండింటి స్నేహాన్ని చూసి, తమ చిన్ననాటి స్నేహితులు గుర్తుకొచ్చారంటూ పేర్కొంటున్నారు.

Also Read:

Viral Video: కొంగలకు వార్నింగ్ ఇచ్చిన గున్న ఏనుగు.. వీడియో చూస్తే మీరే షాకవుతారు..

Tesla Car Burnt: రూ.కోట్లు పెట్టి కొన్నాడు.. కంపెనీపై కోపంతో కారునే పేల్చేశాడు.. వీడియో వైరల్..

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్