Rajitha Chanti |
Updated on: Dec 21, 2021 | 2:05 PM
ఇప్పుడు యావత్ ప్రపంచం హర్నాజ్ సందు గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె ఎవరు.. మిస్ యూనివర్స్ అయ్యాక ఎంత ప్రైజ్ మనీ గెలుచుకుంది అంటూ గూగుల్లో వెతుకున్నారు.
హర్నాజ్ సందు గురించి ఆసక్తి చూపిస్తున్న వారిలో పంజాబ్ ముందు స్థానంలో ఉండగా.. ఆ తర్వాత కర్ణాటక, హర్యానా, కేరళ, ఢిల్లీ ఉన్నాయి. మిస్ యూనివర్స్ 2021 టైటిల్ గెలుచుకున్న తర్వాత హర్నాజ్ సంధుకు ఎంత ప్రైజ్ మనీ వచ్చింది.. ఇంకా ఏమేం గెలుచుకుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలో అతి పెద్ద పోటీ అయిన మిస్ యూనివర్స్ టైటిల్ అనేది కిరీటంతో ప్రారంభమవుతుంది. ఈ కిరీటం ఖరీదు రూ. 37 కోట్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కిరీటం. పలు సంస్థలు కలిసి ఈ కిరీటాన్ని రూపొందించాయి.
మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ విజేతకు ఎంత వరకు ప్రైజ్ మనీ ఇచ్చారనే విషయాన్ని అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. కానీ ఇందులో మిస్ యూనివర్స్ గెలిచిన బ్యూటీకి రూ. 1.89 కోట్లు ఇస్తారని సమాచారం.
మిస్ యూనివర్స్ పోటీలో గెలిచిన తర్వాత వారికి న్యూయార్క్లోని అపార్ట్మెంట్ లో ఏడాదిపాటు నివసించే వెసులుబాటు ఉంటుంది. ఇందులో బట్టల నుంచి కిరాణా వరకు మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఖర్చులను భరిస్తుంది.
అంతేకాకుండా.. మిస్ యూనివర్స్కు ఒక ప్రత్యేక బృందాన్ని నియమిస్తారు. వారి ఖర్చులను సైతం మిస్ యూనివర్స్ సంస్థ భరిస్తుంది.
మేకప్ ఆర్టిస్ట్, డెంటిస్ట్, న్యూట్రిషనిస్ట్, డెర్మటాలజిస్ట్, స్టైలిస్ట్ ఉంటారు. వారి డిమాండ్, ఖర్చులను నిర్వహించడానికి మరో బృందాన్ని నియమిస్తారు.
మిస్ యూనివర్స్గా ఎన్నికైన తర్వాత హర్నాజ్ సందు మిస్ యూనివర్స్ సంస్థకు చీఫ్ బ్రాండ్ అంబాసిడర్గా సంవత్సరంపాటు ఉంటారు. వీరు పార్టీలు, విలేకరులు, సమావేశాలు, స్వచ్చంద సంస్థలు నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంటుంది.