AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaccine Certificates: వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‎పై ప్రధాని ఫొటో ఉంటే తప్పేంటి.. పిటిషన్ కొట్టివేసిన కేరళ హైకోర్టు..

కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను తొలగించాలనే పిటిషన్‌ను కేరళ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.

Vaccine Certificates: వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‎పై ప్రధాని ఫొటో ఉంటే తప్పేంటి.. పిటిషన్ కొట్టివేసిన కేరళ హైకోర్టు..
Modi
Srinivas Chekkilla
|

Updated on: Dec 21, 2021 | 5:31 PM

Share

కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫొటోను తొలగించాలనే పిటిషన్‌ను కేరళ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. పిటిషనర్‎కు లక్ష రూపాయల ఫైన్ విధించింది. ‘‘ ప్రధానమంత్రిని కాంగ్రెస్ ప్రధాని అని గానీ, బీజేపీ ప్రధాని అని గానీ, ఏ రాజకీయ పార్టీకి ప్రధాని అని గానీ ఎవరూ చెప్పలేరని కోర్టు వ్యాఖ్యానించింది. “ప్రభుత్వ విధానాలపై, ప్రధాన మంత్రి రాజకీయ వైఖరిపై విభేదించవచ్చు. కానీ పౌరులు ధైర్యాన్ని పెంపొందించే సందేశంతో ప్రధానమంత్రి ఫోటోతో టీకా ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు” అని న్యాయమూర్తి జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ పేర్కొన్నారు. పిటిషనర్ రూ. 1 లక్ష జరిమానాను ఆరు వారాల్లోగా కేరళ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (కెఎల్‌ఎస్‌ఎ)కి డిపాజిట్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అతను జరిమానాను సకాలంలో జమ చేయడంలో విఫలమైతే అతని ఆస్తులను విక్రయించడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేయాలని కోర్టు పేర్కొంది.

ఈ పిటిషన్ వెనుక రాజకీయ ఉద్దేశం దాగి ఉందని.. ఇది ముఖ్యమైన పిటిషన్ కాదు.. పిటిషన్ వెనుక ఉద్దేశం ప్రజా ప్రయోజనాల కోసం కాదని, ప్రచారం కోసమేనని కోర్టు పేర్కొంది. ” కోర్టులో తీవ్రమైన కేసులు నమోదవుతున్నప్పుడు, అలాంటి అనవసరమైన పిటిషన్లను ప్రోత్సహించలేమని చెప్పింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్‌ల కోసం ప్రజలు డబ్బులు చెల్లించాల్సి వచ్చినప్పుడు సర్టిఫికెట్‌పై ప్రధాని మోదీ బొమ్మ ఉండడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని సమాచార హక్కు (ఆర్‌టీఐ) కార్యకర్త పీటర్ మైలిపరంపిల్ పిటిషన్ దాఖలు చేశారు.

వ్యక్తిగతమైన సర్టిఫికేట్‎లో ప్రధాని ఫొటో ఉండడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించాడు. “ప్రధానమంత్రిగా మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? అతను ప్రజల ఎన్నుకోవడం వల్ల అధికారంలోకి వచ్చాడు. భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ ఇప్పటికీ ఆయన్ దేశ ప్రధాని” అని కోర్టు పేర్కొన్నట్లు తెలసింది.

Read Also.. Pakistan Digital Conspiracy: పాకిస్తాన్ అతి పెద్ద డిజిటల్ కుట్రను భగ్నం చేసిన భారత్.. 20 యూట్యూబ్ ఛానెల్స్ బ్లాక్!