AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HMDA Kokapet Lands: కోకాపేట భూముల అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. త్వరలో ఈ వేలం ద్వారా విక్రయం!

కొవిడ్ మహమ్మారి విజృంభణ కారణంగా చతికిలాపడ్డ ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టే పనిలో పడింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే నిరర్ధక భూములను అమ్మేందుకు కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం.. తాజాగా హౌసింగ్‌ భూములను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది.

HMDA Kokapet Lands: కోకాపేట భూముల అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. త్వరలో ఈ వేలం ద్వారా విక్రయం!
Kokapet
Balaraju Goud
|

Updated on: Dec 22, 2021 | 3:42 PM

Share

Kokapet Lands online auction: కొవిడ్ మహమ్మారి విజృంభణ కారణంగా చతికిలాపడ్డ ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టే పనిలో పడింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే నిరర్ధక భూములను అమ్మేందుకు కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం.. తాజాగా హౌసింగ్‌ భూములను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది. తద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. ప్రభుత్వ భూముల అమ్మకానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ భూముల విక్రయానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా ఈ భూముల విక్రయాన్ని జరపాలని నిర్ణయించింది. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి ఐదువేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశముందని తెలుస్తోంది. భూముల విక్రయానికి సంబంధించి హెచ్ఎండీఏకు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం.

తెలంగాణ సర్కార్‌ సంక్షేమ పథకాల అమలు కోసం ఖజానానికి నింపుకునే పనిలో పడింది. కోకాపేట పరిసర ప్రాంతాల్లోని నిరర్థకంగా ఉన్న భూములను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా.. భూములు, ఆస్తుల వివరాలు, వాటిని అమ్మితే వచ్చే రాబడిపై లెక్కలు తీసేందుకు రెవెన్యూ, హౌసింగ్, హెచ్ఎండీఏ ఆఫీసర్లతో ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. 2021 22 బడ్జెట్​లోనే ప్రభుత్వ భూములు, ఆస్తులు అమ్ముతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకంటే ముందు ఆర్థిక మంత్రి హరీశ్ రావు నేతృత్వంలోని ఆర్థిక వనరుల సమీకరణ కేబినెట్ సబ్ కమిటీ అదనపు ఆదాయ మార్గాలపై అన్వేషించి.. ఆమ్దానీ పెంచుకోవాలంటే ప్రభుత్వ ఆస్తుల అమ్మకం తప్పనిసరని సిఫార్సు చేసింది.

కోకాపేటతోపాటు హైదరాబాద్​ సిటీ చుట్టుపక్కలా ఉన్న హెచ్​ఎండీఏ పరిధిలోని భూములను అమ్మాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఇటీవల నగర శివారు ప్రాంతంలోని ఉప్పల్‌లో భాగయత్ ఫ్లాట్లను విక్రయించిన హెచ్ఎండీఏ భారీగా ఆదాయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్​ సిటీకి ఆనుకుని ఉన్న కోకాపేటలోని భూములకు మస్తు డిమాండ్ ఉంది. రాష్ట్ర ఏర్పాటు నుంచే ఈ భూములను అమ్మేందుకు ప్రభుత్వం ప్లాన్​ చేస్తోంది. అయితే, ఆ భూములు తమవే అని కొందరు కోర్టుకువెళ్లడంతో ఆలస్యం జరిగింది. ఆ భూములు ప్రభుత్వానివేనని నిరుడు కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో వెంటనే వాటిని అమ్మేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. కోకాపేటలో 150 ఎకరాలలో లే అవుట్​ రెడీగా ఉన్నట్టు హెచ్ఎండీఏ అధికారులు చెప్తున్నారు. ఐటీ కారిడార్ దగ్గరగా ఉండటంతో హాట్ కేకుల్లా ప్లాట్లు అమ్ముడు అవుతాయని అంచనా వేస్తున్నారు. కోకాపేట భూములతో కనీసం రూ. 10 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం ధీమాగా ఉంది.

Read Also… Ongole Politics: ఒంగోలులో సుబ్బారావు గుప్తా కేసులో మరో ట్విస్ట్.. దాడికి పాల్పడ్డ వైసీపీ నేత సుభాని అరెస్ట్!