AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandla Ganesh: న్యాయానికి .. ధర్మానికి రోజులు లేవు అంటున్న బండ్లగణేష్.. కారణం ఏంటంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో భీమ్లానాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మలయాళ సూపర్ హిట్ అయ్యపనుమ్ కోషియమ్ రీమేక్ గా తెరకెక్కుతున్న

Bandla Ganesh: న్యాయానికి .. ధర్మానికి రోజులు లేవు అంటున్న బండ్లగణేష్.. కారణం ఏంటంటే..
Bandla Ganesh
Rajeev Rayala
|

Updated on: Dec 23, 2021 | 6:47 AM

Share

Bandla Ganesh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో భీమ్లానాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మలయాళ సూపర్ హిట్ అయ్యపనుమ్ కోషియమ్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వకీల్ సాబ్ సినిమాతో సాలిడ్ రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భీమ్లానాయక్ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాకుసాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలను అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్లు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే భీమ్లానాయక్ సినిమా రిలీజ్ ను తాజాగా వాయిదా వేశారు మేకర్స్.

ముందుగా భీమ్లానాయక్ సినిమాను సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే సంక్రాంతి బరిలో భారీ సినిమాలు ఉండటంతో భీమ్లానాయక్ సినిమా వెనక్కి తగ్గింది. భీమ్లానాయక్ సినిమాకు ముందు జనవరి 7 ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుంది. అలాగే  ఆ తర్వాత వెంటనే రాధేశ్యామ్ రిలీజ్ కు రెడీ అయ్యింది. దాంతో ఆర్ఆర్ఆర్ మేకర్స్ రాధేశ్యామ్ నిర్మాతలు కలిసి భీమ్లానాయక్ సినిమాను వాయిదా వేయాలని కోరారు. ఒకే సారి పెద్ద సినిమాలు రిలీజ్ అయితే థియేటర్స్ కొరత ఏర్పడుతుందని.. కావున తమ సినిమాను వాయిదా వేయాలని భీమ్లానాయక్ ప్రొడ్యూసర్స్ ను కోరారు. దాంతో పవన్ కళ్యాణ్ సినిమా ఫిబ్రవరికి షిఫ్ట్ అయ్యింది. ఫిబ్రవరి 25న విడుదల కానుంది. దాంతో పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసహనాని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పవన్ భక్తిడైన బండ్లగణేష్ ను ఓ ఫ్యాన్స్ ఇలా ట్విట్టర్ ద్వారా కోరాడు..” “మేము అర్థం చేసుకుంటాము .. కానీ పవన్ కల్యాణ్ సినిమాకి సమస్యలు వస్తే ఈ నిర్మాతలు వస్తారా? బండ్లన్నా నువ్వైనా మా తరఫున అడగొచ్చుగా?” అంటూ కొన్ని ప్రొడక్షన్స్ ను ట్యాగ్ చేశాడు. దానికి బండ్లగణేష్ స్పందిస్తూ..” “న్యాయానికి .. ధర్మానికి రోజులు లేవు బ్రదర్” అని రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Konidela Upasana: ప్రధానమంత్రితో సమావేశమైన మెగా కోడలు.. ఎందుకంటే..

RRR: జక్కన్న బిగ్ ప్లాన్.. RRR తెలుగు ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌‌కు అతిథులుగా ఆ ఇద్దరు హీరోలు!

Kamal Haasan: విక్రమ్‌ సెట్‌లోకి అడుగుపెట్టిన కమల్‌.. సినిమా విడుదల ఎప్పుడంటే!