Kamal Haasan: విక్రమ్‌ సెట్‌లోకి అడుగుపెట్టిన కమల్‌.. సినిమా విడుదల ఎప్పుడంటే!

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'విక్రమ్‌'. 'ఖైదీ', 'మాస్టర్‌' వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన లోకేశ్‌ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు

Kamal Haasan: విక్రమ్‌ సెట్‌లోకి అడుగుపెట్టిన కమల్‌.. సినిమా విడుదల ఎప్పుడంటే!
Follow us
Basha Shek

|

Updated on: Dec 22, 2021 | 9:18 PM

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘విక్రమ్‌’. ‘ఖైదీ’, ‘మాస్టర్‌’ వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన లోకేశ్‌ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కమల్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి స్టార్లు కూడా ఈ సినిమాలో నటించనున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం కమల్‌ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో సినిమా షూటింగ్‌కు కాస్త బ్రేక్‌ పడింది. ఇటీవల ఆయన మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు. ఈ క్రమంలో మళ్లీ ముఖానికి రంగు వేసుకునేందుకు సిద్ధమయ్యారు.

బుధవారం ఆయన ‘విక్రమ్‌’ సినిమా సెట్‌లో చేరారు. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్‌ మీడియాలో పంచుకుంది. కమల్‌ దర్శకుడి లోకేశ్‌తో ముచ్చటిస్తోన్న ఫొటోను షేర్‌ చేస్తూ సినిమా ‘యాక్షన్‌ ఫ్రం ది సెట్స్ ఆఫ్ విక్రమ్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది. కాగా ఈ సినిమాను మహేంద్రన్‌తో కలిసి రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ స్వయంగా నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక నేషనల్‌ అవార్డు విన్నర్‌ గిరీష్ గంగాధరణ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read:

Viral Video: గాలిపటంతో పాటే గాల్లోకి ఎగిరిపోయాడు.. 30 అడుగుల ఎత్తులో వేలాడాడు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

Plane Crash: పారా గ్లైడర్‌ను ఢీకొని కుప్పకూలిన విమానం.. ఇద్దరు మృతి..

Myanmar Landslide: మయన్మార్‌లో ఘోర ప్రమాదం.. మైనింగ్‌ సైట్‌లో విరిగిపడిన కొండ చరియలు.. 70 మంది గల్లంతు..