Plane Crash: పారా గ్లైడర్‌ను ఢీకొని కుప్పకూలిన విమానం.. ఇద్దరు మృతి..

ప్రపంచంలో ఎక్కడో ఒకచోట విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక లోపాలు తలెత్తడం తదితర కారణాల వల్ల విమానాలు నేలకూలుతున్నాయి. ఫలితంగా చాలామంది మృత్యువాతపడుతున్నారు

Plane Crash: పారా గ్లైడర్‌ను ఢీకొని కుప్పకూలిన విమానం.. ఇద్దరు మృతి..
Follow us

|

Updated on: Dec 22, 2021 | 4:07 PM

ప్రపంచంలో ఎక్కడో ఒకచోట విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక లోపాలు తలెత్తడం తదితర కారణాల వల్ల విమానాలు నేలకూలుతున్నాయి. ఫలితంగా చాలామంది మృత్యువాతపడుతున్నారు. తాజాగా అమెరికాలోని హ్యుస్టన్‌ నగరంలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఓ తేలికపాటి విమానం పారాగ్లైడర్‌ను ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని, పైలట్‌తో పాటు పారాగ్లైడర్‌ మృత్యువాత పడ్డారని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(FAA) అధికారులు తెలిపారు.

‘సింగిల్​ ఇంజిన్​ సెస్నా 208 విమానం హ్యూస్టన్‌లోని బుష్​ ఇంటర్‌కాంటినెంటల్​ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. ఉదయం 9.40 గంటల సయమంలో టెక్సాస్‌లోని ఫుల్‌షీర్ సమీపంలోకి రాగానే గగనతలంలో ఉన్న ఓ పారాగ్లైడర్​ను ఢీకొంది. విమానం నేలకూలిపోవడంతో విమానంలో ప్రయాణించిన వ్యక్తితోపాటు పారాగ్లైడర్ కూడా మృత్యువాత పడ్డారు. అయితే మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నాం’ అని ఫెడరల్​ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చెప్పుకొచ్చారు.

Also Read:

Ongole Politics: ఒంగోలులో సుబ్బారావు గుప్తా కేసులో మరో ట్విస్ట్.. దాడికి పాల్పడ్డ వైసీపీ నేత సుభాని అరెస్ట్!

Pushpa: బన్నీకి కంగ్రాట్స్‌ చెప్పిన అక్షయ్‌ కుమార్‌.. త్వరలోనే పుష్ప సినిమా చూస్తానని ట్వీట్‌..

Vijayawada: ఏపీలో కొనసాగుతున్న థియేటర్ల తనిఖీలు.. కృష్ణా జిల్లాలో 15 థియేటర్లు సీజ్‌..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ